డైరెక్షన్ కంటే ముందే హీరోగా సినిమా చేసిన బింబిసార డైరెక్టర్… సినిమా పేరేంటో తెలుసా?
నందమూరి కళ్యాణ్ రామ్ ముందు నుంచు కూడా ప్రయోగాలకు పెట్టింది పేరు. విభిన్న కథలను ఎంచుకుంటూ హిట్స్ ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు కళ్యాణ్ రామ్. ఈ నందమూరి హీరో నటించిన లేటెస్ట్ టైం ట్రావెల్ కాన్సెప్ట్ మూవీ బింబిసార. వశిష్ట అనే నూతన దర్శకుడు ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు మొదటి నుంచి మంది బజ్ ఏర్పడింది. దానికి తోడు అన్న కళ్యాణ్ రామ్ గురించి ఎంటీఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడిన మాటలు అంచులను మరింత పెంచేలా చేసింది. ఇక ఈ సినిమా దర్శకుడి గురించి ఆసక్తికర విషయాలు మీ కోసం

భారీ బడ్జెట్ తో
నందమూరి కల్యాణ్ రామ్ నటించిన తాజా చిత్రం 'బింబిసార'. మల్లిడి వశిష్ట అనే కొత్త దర్శకుడు తెరకెక్కించిన ఈ సినిమాను నందమూరి తారక రామారావు ఆర్ట్స్ బ్యానర్‌పై కళ్యాణ్ రామ్ బావమరిది హరికృష్ణ కళ్యాణ్ రామ్ కెరీర్లోనే భారీ బడ్జెట్ తో నిర్మించాడు. కీరవాణి ఈ చిత్రానికి నేపధ్య సంగీతం అందించగా చిరంతన్ భట్ సంగీతం అందించారు. ఈ సినిమాలో కేథరిన్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటించగా.. వెన్నెల కిశోర్, శ్రీనివాసరెడ్డి, వైవా హర్ష కీలక పాత్రలలో నటించారు. ఇక వరీనా హుసేన్ ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు.

గతంలోనే
నందమూరి కల్యాణ్ రామ్ కెరీర్లోనే భారీ బడ్జెట్‌తో రూపొందిన 'బింబిసార' మూవీ సోషియో ఫాంటసీ జోనర్‌లో తెరకెక్కింది. బింబిసారుడు అనే క్రూరమైన రాజు.. టైం ట్రావెల్ చేసి ప్రస్తుత కాలానికి రావడంతో ఇక్కడి పరిస్థితులు చూసి మళ్ళీ వెనక్కు రావడం లాంటివి ఆసక్తికరంగా మలిచారు. అయితే ఈ సినిమా తెరకెక్కించిన దర్శకుడి మీద ప్రసంశల వర్షం కురుస్తోంది. అయితే అయన గతంలోనే హీరోగా ఒక సినిమా చేశాడు.

కులశేఖర్
ప్రముఖ నిర్మాత మల్లిడి సత్యనారాయణ సొంత కొడుకు వెంకట్. మల్లిడి సత్యనారాయణ గతంలో ఢీ, భగీరథ, బన్నీ వంటి సిన్మాలు చేశారు. వెంకట్ 2007లో 'ప్రేమలేఖ రాశా' అనే సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. అంజలి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాతోనే గీత రచయిత కులశేఖర్ దర్శకుడిగా తొలిసారి మెగాఫోన్ పట్టుకున్నాడు.

నటనకు స్వస్తి చెప్పి
అయితే కొన్ని అనివార్య కారణాలతో ఈ సినిమా అనుకున్న సమయంలో అనుకున్న విధంగా విడుదల కాలేకపోయినా ఇప్పుడది యూ ట్యూబ్ లో అయితే అందుబాటులో ఉంది. అందులో హీరోగా నటించిన వెంకట్ ను అందరూ ముద్దుగా వేణు అని పిలిచే వారు. హీరోగా నటించిన మొదటి సినిమాతోనే ఎదురైన చేదు అనుభవాలతో వేణు... నటనకు స్వస్తి చెప్పి, దర్శకత్వం మీద ఫోకస్ పెట్టాడు.

సొంత బ్యానర్లో
ఒక ఫాంటసీ కథను తయారు చేసుకుని తెలిసివారిని కలిస్తూ వచ్చాడు. కొత్త దర్శకుడి మీద నమ్మకం లేక కొందరు, ఇంత భారీ బడ్జెట్ సినిమా తీసి రిస్క్ చేయడం ఇష్టం లేక మరికొందరు వేణుకు అవకాశం ఇవ్వలేదు. ఆ సమయంలో కథ నచ్చి కళ్యాణ్ రామ్ సొంత బ్యానర్లో సినిమా చేశారు. వెంకట్ ఈ సినిమా కోసం తన పేరును 'వశిష్ఠ'గా మార్చుకుని హిట్ కొట్టాడు.


Click it and Unblock the Notifications











