twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాలీవుడ్ మేటి నటి బీనారాయ్ కన్నుమూత

    By Srikanya
    |

    బాలీవుడ్‌ మేటి నటి బీనారాయ్‌ ఆదివారమిక్కడ గుండెపోటుతో మరణించారు. ఆమె వయసు 78 సంవత్సరాలు. బీనారాయ్‌ ఆదివారం తెల్లవారుజామున అయిదుగంటలకు గుండెపోటుతో మరణించినట్లు ఆమె కుమారులు ప్రేమ్‌కిషన్‌, కైలాష్‌నాథ్‌లు తెలిపారు. సోమవారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు చెప్పారు. 1936, జూన్‌ 4న లక్నోలో జన్మించిన బీనారాయ్‌.. 1951లో 'కాళి గాథ' చిత్రం ద్వారా చిత్రరంగ ప్రవేశం చేశారు. అనంతరం ఆమె హీరోయిన్‌ గా నటించిన 'అనార్కలీ'(1953), 'తాజ్‌ మహల్‌',(1953) 'ఘూంఘట్‌' తదితర చిత్రాలు గొప్పపేరు తెచ్చిపెట్టాయి.

    ఘూంఘట్‌ చిత్రంలో చూపిన నటనాప్రతిభకు 1960లో బీనారాయ్‌ ఫిలింఫేర్‌ అవార్డును అందుకున్నారు. 1953లో తనతో కలిసి'ఔరత్‌' చిత్రంలో నటించిన నటుడు ప్రేమ్‌నాథ్‌ను వివాహమాడారు. రాజ్‌ కపూర్‌ కు ప్రేమ్‌ నాథ్‌ సన్నిహిత బంధువు. ఎల్‌.వి.ప్రసాద్‌ హిందీలో నిర్మించిన 'దాదీమా'(1966) ఆమె నటించిన ఆఖరుచిత్రం. ఔరత్‌, సమందర్‌, షాగుఫా, వతన్‌ చిత్రాలు ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. దాదాపు నాలుగు దశాబ్దాల పాటు (1951-1990) వందకు పైగా చిత్రాల్లో నటించారు. ప్రముఖ నటుడు ప్రేమ్‌ నాథ్‌ తో ఆమె వివాహం జరిగింది. వారికి ఇద్దరు కుమారులు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X