Don't Miss!
- Technology OnePlus Watch 2 వన్‌ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- News ఏపీలో ఇప్పటివరకు భారీగా పట్టుబడిన నగదు, మద్యం, బంగారం.. అత్యధికంగా ఎక్కడంటే
- Sports SRH vs RCB: అందుకే వాషింగ్టన్ సుందర్‌పై వేటు వేసాం: ప్యాట్ కమిన్స్
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
బాలీవుడ్ మేటి నటి బీనారాయ్ కన్నుమూత
బాలీవుడ్ మేటి నటి బీనారాయ్ ఆదివారమిక్కడ గుండెపోటుతో మరణించారు. ఆమె వయసు 78 సంవత్సరాలు. బీనారాయ్ ఆదివారం తెల్లవారుజామున అయిదుగంటలకు గుండెపోటుతో మరణించినట్లు ఆమె కుమారులు ప్రేమ్‌కిషన్, కైలాష్నాథ్లు తెలిపారు. సోమవారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు చెప్పారు. 1936, జూన్ 4న లక్నోలో జన్మించిన బీనారాయ్.. 1951లో 'కాళి గాథ' చిత్రం ద్వారా చిత్రరంగ ప్రవేశం చేశారు. అనంతరం ఆమె హీరోయిన్ గా నటించిన 'అనార్కలీ'(1953), 'తాజ్ మహల్',(1953) 'ఘూంఘట్' తదితర చిత్రాలు గొప్పపేరు తెచ్చిపెట్టాయి.
ఘూంఘట్ చిత్రంలో చూపిన నటనాప్రతిభకు 1960లో బీనారాయ్ ఫిలింఫేర్ అవార్డును అందుకున్నారు. 1953లో తనతో కలిసి'ఔరత్' చిత్రంలో నటించిన నటుడు ప్రేమ్‌నాథ్‌ను వివాహమాడారు. రాజ్ కపూర్ కు ప్రేమ్ నాథ్ సన్నిహిత బంధువు. ఎల్.వి.ప్రసాద్ హిందీలో నిర్మించిన 'దాదీమా'(1966) ఆమె నటించిన ఆఖరుచిత్రం. ఔరత్, సమందర్, షాగుఫా, వతన్ చిత్రాలు ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. దాదాపు నాలుగు దశాబ్దాల పాటు (1951-1990) వందకు పైగా చిత్రాల్లో నటించారు. ప్రముఖ నటుడు ప్రేమ్ నాథ్ తో ఆమె వివాహం జరిగింది. వారికి ఇద్దరు కుమారులు.