మంచు మనోజ్ బిందాస్ ఆడియో రిలీజ్ డేట్
మనోజ్ హీరోగా వీరూపోట్ల దర్శకత్వంలో రూపొందుతున్న బిందాస్ చిత్రం ఆడియో నవంబర్ తొమ్మిదవ తేదీన రిలీజ్ కానుంది. మనసంతా నువ్వే, నువ్వు వస్తానంటే నేవద్దంటానా, వర్షం, సంతోషం వంటి చిత్రాలకు కథలు అందించిన వీరూపోట్ల ఈ చిత్రంతో దర్శకుడుగా మారుతున్నారు. ఇక ఈ చిత్రంలో మనోజ్ సరసన షీనా హీరోయిన్ గా చేస్తోంది. కేర్ ప్రీ గా, బిందాస్ గా తిరిగే అజయ్ అనే కుర్రాడు హఠాత్తుగా ఓ బాధ్యతను తీసుకోవాల్సి వస్తుంది. అదే ఈ చిత్రం కధ అంటున్నారు దర్శక, నిర్మాతలు. అందుకే ఈ చిత్రం టైటిల్ కు ట్యాగ్ గా అజయ్ గాడి విజయ గాధ అని పెట్టారు.ఇక సుంకర రామబ్రహ్మం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆయన వెంకటేష్ హీరోగా నమో వెంకటేశ చిత్రాన్ని సైతం రూపొందిస్తున్నారు. బొబొ శశి సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో కాశీ విశ్వనాధ్, ఆహుతి ప్రసాద్, సునీల్, బెనర్జీ, పృధ్వీరాజ్ తదితరులు మిగతా పాత్రల్లో కనపించనున్నారు.


Click it and Unblock the Notifications











