బిందాస్ ఫిల్మ్ రిలీజ్ డేట్
మనసంతా నువ్వే, నువ్వొస్తానంటే నే వద్దంటానా, సంతోషం, వర్షం వంటి చిత్రాలకు కథలందించిన వీరూపోట్ల దర్శకుడుగా మారి బిందాస్ అనే చిత్రాన్ని రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఆ చిత్రం అన్ని పనులు పూర్తి చేసికుని నవంబర్ 12న విడుదలకు రెడీ అవుతోంది. ఈ సందర్భంగా వీరూ మాట్లాడుతూ తమ చిత్రం రిలీజ్ కు వరదలు ఎఫెక్టు ఏమీ ఉండదని అంటున్నారు. అలాగే ఈ చిత్రం మనోజ్ కెరీర్ కు ప్లస్ అవుతుందని అన్నారు. అలాగే తమ చిత్రం సినీ ప్రియులుకు గ్యారింటీగా వినోదాన్ని అందిస్తుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసారు. ఇక ఈ చిత్రానికి అజయ్ గాడి విజయ గాధ అనే ట్యాగ్ లైన్ ఉంటుంది. ఏకే ఎంటర్టైన్ మెంట్ బ్యానర్ పై ఏటీవీ వారు దీనిని నిర్మిస్తున్నారు. వీరే శ్రీనువైట్ల దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా నమో వెంకటేశ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అలాగే మంచు మనోజ్ ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో రానున్న వేదం చిత్రంలో రాక్ స్టార్ గా కనిపించనున్నాడు.


Click it and Unblock the Notifications











