‘బిందాస్’ లోగో ఆవిష్కరణ
ఎ.కె. ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ మంచు మనోజ్ కుమార్ కథానాయకుడిగా ఓ చిత్రాన్ని నిర్మిస్తోంది. షీనా నాయిక. వీరు పొట్ల దర్శకుడు, సుకర రామబ్రహ్మం నిర్మాత. ఈ చిత్రానికి 'బిందాస్" అనే పేరుని పెట్టారు'అజయ్ గాడి విజయగాధ" ఉప శీర్షిక. ప్రముఖ కథానాయకుడు బాలకృష్ణ ముఖ్య అతిధిగా హాజరై చిత్రం లోగోని ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ 'బిందాస్" అనే పేరు యువతను ఆకట్టుకునేలా ఉందన్నారు. మోహన్ బాబు కుటుంబంలో ఒక్కొక్కరూ ఒక్కో తరహా నటనను ప్రదర్శిస్తుంటారు. మనోజ్ ప్రతిభ గల నటుడు. ఈ చిత్రం విజయవంతం కావాలని ఆకాంక్షించారు.
మనోజ్ మాట్లాడుతూ అన్నయ్య బాలకృష్ణ నిర్ణయించిన ముహూర్తం ప్రకారమే టైటిల్ ఆవిష్కరణ జరిగింది. సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందన్న నమ్మకం కలుగుతోంది టాకీ పూర్తయింది. పాటలతో పాటు మిగిలిన భాగాన్ని పూర్తిచేసి చిత్రాన్ని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామన్నారు. ఈ కార్యక్రమంలో షీనా, వీరుపొట్ల, సుంకర రామబ్రహ్మం, కాశీవిశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు.


Click it and Unblock the Notifications











