నాని ట్విస్ట్ కు బిందుమాధవికి హర్రర్
సిద్దార్దతో ఓయ్ చిత్రం డైరక్ట్ చేసిన ఆనంద రంగా ఇప్పుడో చిత్రం నిర్మించటానికి సన్నాహాలు చేస్తున్నారు. పొగ టైటిల్ తో రూపొందే ఈ చిత్రం 4D హర్రర్ ఫిలిం అని తెలుస్తోంది. ఈ చిత్రంలో బిందుమాధవిని ఎంపిక చేసినట్లు సమాచారం. మార్తాండ శంకర్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది. ఈ చిత్రం కోసం బిందుమాధవి ప్రత్యేకంగా వర్క్ షాపులకు హాజరవనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం భయపెట్టే సైక్లాజికల్ హర్రర్ అని చెప్తున్నారు. ఇక 'ఆవకాయ బిర్యాని' చిత్రంతో పరిచయమైన బిందు మాధవికి ఆ తర్వాత బంపర్ ఆఫర్ తో బ్రేక్ వస్తుందని భావించింది.అయితే ఆ సినిమా తర్వాత ఆమె కెరీర్ చెప్పుకోదగిన మలుపు ఏమీ తిరగలేదు.తెలుగు అమ్మాయి కావటమే మైనస్ గా అయిందే ఏమో కానీ ఆమె ఖాళీ పడిపోయింది.ఆ క్రమంలో ఆమెకు దొరికిన సినిమా పిల్ల జమిందారు.
నాని హీరోగా అశోక్ దర్శకత్వంలో రూపొందే ఆ చిత్రం ఆమెకు బ్రేక్ ఇస్తుందని భావించింది.ఎందుకంటే అలా మొదలైంది చిత్రంతో నానికి మంచి మార్కెట్ రావటంతో ఈ సినిమా కూడా బాగానే వర్కవుట్ అవుతుందని అనుకుంది.అయితే ఆమె ఊహించిన దానికి రివర్స్ గా జరగుతోంది. ఈ చిత్రంతోనూ ఆమెకు తెలుగులో ఆఫర్స్ ఏమీ రాలేదు. అందుకు కారణం బిందుమాధవి పాత్ర లెంగ్త్ తగ్గించేయటమేనని తెలుస్తోంది. గుంటూరు లో జరిగిన షూటింగ్ లో ఆమెకు ఈ విషయం అర్దమైంది.తనకు కథ చెప్పినప్పుడు చెప్పిన సీన్లేమీ తీయకపోవటంతో ఆమె ఆశ్చర్యపోయి సినిమా చేయనని షూటింగ్ నుంచి బయిటకు వెళ్ళిపోయింది. అయితే ఆ తర్వాత ఆమెను బ్రతిమాలి పూర్తి చేసారు. పిల్ల జమీందార్ చిత్రం హిట్టు టాక్ వచ్చినా ఆమెకు ఆఫర్స్ మాత్రం రాలేదు. దాంతో వచ్చిన ఈ ఆఫర్ ఒప్పుకుంది. ఈ చిత్రంతో అయినా ఆమెకు క్రేజ్ వచ్చి కెరీర్ లో నిలదొక్కుకుంటుందేమో చూడాలి.


Click it and Unblock the Notifications











