హెలికాప్టర్ నుంచి పడి గాయపడ్డ ‘బిందు మాధవి’
ప్రస్తుతం ఈచిత్రానికి సంబంధించిన యాక్షన్ సన్నివేశాలు హాకాంగ్‌లో చిత్రీకరిస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఓ సన్నివేశం చిత్రకరణలో భాగంగా బింధు మాధవితో పాటు పియా భాజ్ పాయ్ హెలికాప్టర్ ఎక్కారు. అయితే ప్రమాద వశాత్తు ఇద్దరు కింద పడిపోయారు. వెంటనే వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. తాజాగా అందిన సమాచారం ప్రకారం అదృష్ట వశాత్తు ఇద్దరూ ఔటాఫ్ డేంజర్లో ఉన్నారని, ప్రస్తుతం కోలుకుంటున్నారని తెలుస్తోంది. హెలికాప్టర్ తక్కువ ఎత్తులో ఉండటం వల్ల ప్రాణాపాయం తప్పిందని యూనిట్ సభ్యులు అంటున్నారు.
'ఆవకాయ్ బిర్యానీ' చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన పదహారణాల అచ్చ తెలుగమ్మాయి బిందు మాధవి. అయితే ఆ సినిమా అంతగా ప్రేక్షకులను రంజింపచేయలేకపోవడంతో ఆమెకు అవకాశాలు అంతగా రాలేదు. దాంతో ఈ ముద్దుగుమ్మ తమిళం పై దృష్టి సారించి అక్కడి వారిని ఆకట్టుకోవడంతో తమిళ ఇండస్ట్రీలో మంచి సినిమాల్లోనే నటిస్తోంది. దాంతో ఆమె ప్రస్తుతం తెలుగు తెరపై ఒక్క సినిమాలోనూ నటించడంలేదు.
బిందు మాధవి నటించిన 'ఖజుగు' అనే తమిళ చిత్రం ఇటీవలే విడుదలై అందరిచేత మంచి మార్కులను వేసుకుంది. తాజాగా తెరకెక్కుతున్న 'సట్టం ఒరు ఇరుత్తారై' అనే చిత్రంలో ఒక ముఖ్య పాత్ర చేస్తోంది. విక్రమ్ ప్రభు, కార్తీక, ప్రియా బాజ్పాయ్‌లు ప్రధాన పాత్రలుగా ఈ చిత్రాన్ని మొదలుపెట్టారు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల విక్రమ్ ప్రభు, కార్తీక ఇద్దరూ ఈ చిత్రం నుంచి తప్పుకున్నారు. ఈ చిత్రంలో కార్తీక పాత్రకి బిందు మాధవి ఎంపికయ్యారు. ప్రస్తుతం ఈ చిత్రం తమన్‌కుమార్, పియా బాజ్పాయ్, బిందు మాధవి, రీమాసేన్‌లు ప్రధాన తారాగణంగా తెరకెక్కుతోంది. స్నేహా బ్రిట్టో దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఎస్.ఏ.చంద్రశేఖర్ నిర్మిస్తున్నారు. విజయ్ ఆంథోని ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.


Click it and Unblock the Notifications












