బిందుకు పూరీ వల్లే...
ఆవకాయ బిర్యాని చిత్రంతో పరిచయమైన బిందు మాధవికు ఆ చిత్రం పరాజయం కావటంతో పెద్దగా ఆఫర్స్ రాలేదు. అయితే తాజాగా పూరీ జగన్నాధ్ తమ్ముడు సాయిరాం శంకర్ హీరోగా వచ్చిన బంపర్ ఆఫర్ చిత్రంలో ఆమె చేసింది. దాంతో ఆమె ఒక్కసారిగా ఎక్సపోజ్ అయింది. ఆమె కెరీర్ లో కదలిక వచ్చింది.
రామ్ హీరోగా దిల్ రాజు నిర్మించనున్న 'రామ రామ కృష్ణ కృష్ణ' లో బుక్కయింది. అంతేగాక త్రీ ఏంజిల్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత సి.అశ్వనీదత్ కుమార్తె శేషు ప్రియాంక చలసాని ('బాణం' ఫేమ్) నిర్మిస్తున్న 'ఓం శాంతి' చిత్రం లో కూడా ఆమెను ఒక హీరోయిన్ గా తీసుకున్నారు. ఇందులో కాజల్-నవదీప్ ఒక జంట కాగా, మరో జంటగా నిఖిల్-బిందుమాధవి నటిస్తున్నారు. బంపర్ ఆఫర్ విజయం సంగతి ఎలా ఉన్నా మొత్తానికి ఆమెకు మాత్రం బ్రేక్ వచ్చినట్లే.దాంతో ఇదంతా పూరీ చలవేనంటున్నారు. పూరీ రికమెండ్ చేసి తన చిత్రంలోకి తీసుకోబట్టే అందరి దృష్టీ ఆమెపై పడి బిజీ అవుతోందంటున్నారు.


Click it and Unblock the Notifications











