త్రిషా బాయ్‌ఫ్రెండ్‌తో బిందుమాధవి డేటింగ్.. మీడియా ముందు బిగ్‌బాస్ బ్యూటీ ఇచ్చిన క్లారిటీ ఏమిటంటే?
జై సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన నవదీప్ తనదైన యాక్టింగ్ తో ఆకట్టుకున్నాడు. గౌతమ్ ఎస్.ఎస్.సి, చందమామ సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్న ఈ హీరో చాలా కాలంగా నెగెటివ్, సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేస్తున్నాడు. తాజాగా ఆయన ప్రధాన పాత్ర పోషించిన వెబ్ సిరీస్ న్యూసెన్స్. ఇందులో మరో కీలక పాత్రలో హీరోయిన్ బిందు మాధవి అలరించనుంది. సినిమాల్లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటి బిగ్ బాస్ ఓటీటీ సీజన్ ద్వారా మంచి గుర్తింపు పొందింది. అయితే తాజాగా తన డేటింగ్ పై క్లారిటీ ఇచ్చింది.
మదనపల్లె ప్రాంతంలో: హీరో నవదీప్, బ్యూటిఫుల్ బిందు మాధవి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా వెబ్ సిరీస్ న్యూసెన్స్. ఈ వెబ్ సిరీస్ కు ప్రవీణ్ దర్శకత్వం వహించగా.. కార్తికేయ 2, ధమాకా వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. 1990-2000 దశకంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని మదనపల్లె ప్రాంతానికి చెందిన ప్రెస్ క్లబ్ లోని స్ట్రింగర్స్ కు సంబంధించిన కథాంశంతో ఇది తెరక్కింది.

సంకోచం లేకుండా: ప్రముఖ తెలుగు ఓటీటీ ఆహా వేదికగా మే 12న స్ట్రీమింగ్ కు రెడీ అవుతోంది న్యూసెన్స్ వెబ్ సిరీస్. ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ట్రైలర్ లాంచ్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో హీరో నవదీప్, హీరోయిన్ బిందు మాధవిపై యాంకర్ ప్రశ్నల వర్షం కురిపించింది. ఆ ప్రశ్నలకు వారిద్దరు ఎలాంటి సంకోచం లేకుండా సూటిగా సమాధానాలిచ్చారు.
నవ్వుకుంటూ: త్రిషా బాయ్‌ఫ్రెండ్‌ను మీరు డేట్ చేస్తున్నారని టాక్. దానిపై మీ కామెంట్ అని యాంకర్ అడిగింది. దీంతో ఓవైపు షాక్ అయిన మరోవైపు ఎప్పటి విషయమో అడిగారు అన్నట్లుగా నవ్వుతూ ఆన్సర్ ఇచ్చింది బిందు మాధవి. 'అది నిజమే. కానీ అది రెండు వేరు వేరు సమయాల్లో జరిగింది. ఒకేసారి అలా జరగలేదు' అని నవ్వుకుంటూ సమాధానం ఇచ్చింది బిందు మాధవి.

ఏమైనా ఉంటే చెప్పండి: త్రిషా గారికి ఎక్స్ అయ్యాక మీరు డేట్ చేశారు అని యాంకర్ అంటే అవను అని బిందు మాధవి తెలిపింది. సో అది నిజమే. మేము రాసుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది లేకుండా అని యాంకర్ సరదాగా అంటే అవును నవ్వుతూ చాలా స్పోర్టివ్ గా చెప్పింది బిందు మాధవి. అయితే మాకు గూగుల్ లో సెర్చ్ చేస్తే ఆ ఒక్కే ప్రశ్నే దొరికింది. మాకు తెలియనివి ఏమైనా ఉంటే చెప్పండి అని మళ్లీ యాంకర్ అడగ్గా.. అలాంటివి ఏం లేవు అని బిందు చాలా కూల్ గా ఆన్సర్ ఇచ్చింది.

వరుణ్ తో డేటింగ్: ఇదిలా ఉంటే స్టార్ హీరోయిన్ త్రిష.. ముంబై వ్యాపారవేత్త అయిన వరుణ్ మణియన్ తో చాలా కాలం రిలేషన్ షిప్ లో ఉంది. అతనితో డేటింగ్ తర్వాత వివాహం కూడా చేసుకోవాలనుకుంది. ఈ క్రమంలోనే నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. అయితే అనుకోని కారణాల వల్ల వారి రిలేషన్ కు బ్రేక్ పడింది. ఆ తర్వాతే వరుణ్ తో బిందు మాధవి డేటింగ్ చేసినట్లుగా తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











