సీఎం రిలీఫ్ ఫండ్ కు లక్ష రూపాయలు ఇచ్చిన బిందు
మన దర్శకనిర్మాతలకు తెలుగు అమ్మాయిల కన్నా ఇతర భాషల నుండీ వచ్చిన అమ్మాయిలే బాగా నచ్చుతారు. వారికి మన భాష రాకపోయినా, నటనరాకపోయినా అందంగా వుంటే చాలు హీరోయిన్ అయిపోయినట్టే. వారు కూడా ఒక్క హిట్ వస్తే చాలు అమాంతం భారీ పారితోషికాన్ని డిమాండ్ చేస్తారు. అయినా 'నిన్ను వదల బొమ్మాళీ' అని వారి వెంట పడి మరీ డేట్స్ తీసుకుంటారు. ఇదంతా వారి వ్యాపారం మనకెందుకులే అనుకున్నా, ఇక్కడ అన్ని కోట్ల రూపాయలు సంపాదించుకొని, వారిని ఎంతగానో అభిమానించి వారీ స్థాయిలో వుండటానికి కారణమయిన అభిమానులు వరదల పాలయ్యి కష్టాల్లో వుంటే ఆదుకోవాలనే ఆలోచన ఏ ఒక్క తారకీ రాకపోవడం దురదృష్టకరం.
కానీ చేసింది రెండు సినిమాలే అయినా, కోట్లలో పారితోషికం తీసుకోకపోయినా మన తెలుగమ్మాయి బిందుమాధవి సిఎం ఫ్లడ్ రిలీఫ్ ఫండ్ కు లక్షరూపాయలు విరాళం ఇచ్చి తన దయార్థ హృదయాన్ని చాటుకొంది. ఇప్పుడిప్పుడే సినిమాలు చేసుకుంటున్న బిందు మాధవి చేసిన ఈ పని కోట్లలో పారితోషికం తీసుకుంటున్న ఇలియానా, త్రిష, అనుష్క లాంటి వారు సిగ్గుపడాల్సిన విషయం.


Click it and Unblock the Notifications











