పూరి జగన్నాధ్ సెలక్ట్ చేసిన హీరోయిన్స్ కి టాలివుడ్ లో మంచి డిమాండ్ ఉంటుందన్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన కళ్ళు ఆవకాయ బిర్యాని సినిమాతో పరిచయమైన బిందు మాధవి పై పడింది. పెద్ద పెధ్ద కళ్ళు,తెలుగు స్పష్టంగా మాట్లాడగలగటం ప్రత్యేకతలుగా గల ఆ అమ్మాయిని చూసి ఇంప్రెస్ అయి తన కోతులు సినిమాలో ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం. పూరి తమ్ముడు సాయిరామ్ శంకర్ ఫ్రధాన పాత్రలో చేస్తున్న ఈ సినిమాలో ముమైత్ మరో ముఖ్య పాత్రలో కనిపించనుంది. ఇక బిందుమాధవి హీరోయిన్ గా అలరించనుంది. ఇప్పటికే స్క్రిప్టు వర్క్ ఫినిష్ చేసుకున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్ళే అవకాశముందని తెలుస్తోంది. బెస్టాఫ్ లక్ బిందు.
Story first published: Tuesday, November 18, 2008, 11:00 [IST]