twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సొంత తండ్రిని కాదని తెగించిన బిందు మాధవి!

    By Bojja Kumar
    |

    ఆవకాయ బిర్యానీతో వెండితెరకు పరిచయం అయిన అచ్చ తెలుగు అమ్మాయి బిందు మాధవి. ఈ సినిమాలో బిందు మాధవి నటన అందరినీ ఆకట్టుకుంది. సినిమాల్లోకి రాక ముందు ఈ భామ మోడలింగ్ రంగంలో ఉంది. అయితే సినిమాల్లో నటించాలని నిర్ణయం తీసుకున్నాక ఇంట్లో వాళ్లు ఆమెకు అభ్యంతరం చెప్పారు. ముఖ్యంగా వాళ్ల నాన్న నువ్వు నటించడానికి వీల్లేదు అని ఆమెను నిరుత్సాహ పరిచాడట. దీంతో తెగించిన ఆమె సొంత తండ్రిని, కుటుంబ సభ్యులను లెక్కచేయకుండా ఆరు నూరైనా సినిమాల్లో నటించి తీరాలని డిసైడైంది. ఇంట్లో వాళ్లను తన రూట్లోకి తెచ్చుకోవడం కోసం 8 నెలల పాటు తండ్రితో మాట్లాడకుండా మొండి పట్టుపట్టింది. దీంతో ఇంట్లో వాళ్లు దిగిరాక తప్పలేదు.

    ఈ విషయాలన్నీ బిందు స్వయంగా మీడియాకు వెల్లడించింది. ఇంకా తన పర్సనల్ విషయాల గురించి చెబుతూ.... పుట్టింది ఏపీలో అయినా తండ్రి ఉద్యోగరీత్యా పలు ప్రాంతాలకు తిరగామని, ఆ తర్వాత చెన్నైలో సెటిల్ అయినట్లు చెప్పింది. ఖాళీ సమయాల్లో గిటార్ వాయించటం ఇష్టమని, వారంలో రెండు రోజులు స్నేహితురాళ్లతో బైక్ మీద ఊరు చుట్టొస్తానని బిందు చెబుతోంది. బిందు మాధవి నటించిన 'పిల్ల జమిందార్" ఇటీవల విడుదలై మంచి విజయం సాధించింది. ఈ విషయం పట్ల తెగ సంతోషం వ్యక్తం చేస్తుంది బిందు. ముంబై భామలతో పోటీపడలేక మెయిన్ హీరోయిన్ పాత్రలు దక్కించుకోలేక పోతేన్న బిందు...ఆ స్థాయికి చేరుకుంటుందో? లేదో? చూడాలి.

    English summary
    Bindu Madhavi opposed her father. Bindu's father unhappy on her movie career.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X