మహేష్ ని కలవరిస్తున్న...
మహేష్ బాబు లాంటి అందమైన అబ్బాయే నా డ్రీమ్ బోయ్...అతను ఇంకా తారసపడలేదు..అంటోంది బిందు మాధవి. ఆవకాయ బిర్యాని సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ రాయలసీమ ముద్దుగుమ్మ తన మనస్సుని మీడియా ముందు పరిచింది. ఓ ప్రముఖ కంపెనీ యాడ్ లో నటించిన ఆమెను చూసి ఆవకాయ బిర్యాని వాళ్ళు బుక్ చేసారంటోంది. బి.టెక్ చదువుతుండగా మోడలింగ్ వైపుకు వస్తానంటే ఆమె తండ్రి ఫర్మిషన్ ఇవ్వలేదుట. ఆర్నెల్లు పాటు మాట్లాడలేదట. అయితే ఆమె పట్టుదల చూసి తప్పనిసరై చదువు కొనసాగిస్తానని ప్రామిస్ చేయించుకుని ఓకే చేసారుట.
ఇక గ్లామర్ రోల్ వేయటానికి తనకేం అభ్యంతరం లేదంటోంది. అందుకే ఆవకాయ బిర్యాని అనంతరం పల్లెటూరు అమ్మాయి క్యారెక్టరు వేయాలని రెండు ఛాన్స్ లు వచ్చినా వద్దనుకుందిట. అలాగే పవన్ కళ్యాణ్, నాగార్జున లతో పనిచేయాలని కోరికంటోంది. ఇష్టమైన హీరోయిన్ భూమిక అంటోంది. ప్రస్తుతం ఆమె ఓ రెండు సినిమాలు కమిట్ అయ్యిందిట. త్వరలోనే వివరాలు ప్రకటిస్తానంటోంది. అలాగే తాను ఓపెన్ గా మాట్లాడుతానని ఏ విషయంలోనైనా స్పష్టంగా ఉండటమే మంచిదని నమ్ముతానంటోంది.


Click it and Unblock the Notifications











