Kamal Haasan కు బిందుమాధవి స్పెషల్ విషెస్.. మీరు సార్ నిజమైన జెంటిల్‌మెన్ అంటూ..
సినీ ప్రపంచంలో లోక నాయకుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్టార్ ఇమేజ్ ను సంపాదించుకున్న కమల్ హాసన్ నేడు 68వ వసంతంలోకి అడుగుపెడుతున్నారు. ఇక ఈ సందర్భంగా ఆయనకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకులు ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. సోషల్ మీడియాలో గత రాత్రి నుంచి కమల్ హాసన్ కు సంబంధించిన అనేక రకాల ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.
అయితే ఈ సందర్భంగా పలువురు సెలబ్రిటీలు విష్ చేస్తున్న విధానం కూడా సోషల్ మీడియాలో హైలైట్ గా నిలుస్తుంది. ఇక బిగ్ బాస్ తెలుగు నాన్ స్టాప్ విన్నర్ బిందు మాధవి కూడా ఒక ప్రత్యేకమైన ఫోటో పోస్ట్ చేసి లోక నాయకుడికి ప్రేమతో శుభాకాంక్షలు తెలిపింది. బిందు మాధవి కమల్ హాసన్ తో డాన్స్ చేస్తున్నట్లు పోజులు ఇచ్చిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో నెటిజన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంటోంది. అంతేకాకుండా ఆమె ప్రత్యేకంగా క్యాప్షన్ కూడా ఇచ్చింది.

ఈ గ్లిట్జ్ గ్లామర్ ప్రపంచంలో, చుట్టూ పురుషులు ఉన్నారు... మీరు సార్ నిజమైన జెంటిల్‌మెన్. పుట్టినరోజు శుభాకాంక్షలు కమల్ సర్ అంటూ.. మహిళను ఎలా ప్రత్యేకంగా భావించాలో మీకు తెలుసు.. అని బిందు మాధవి ప్రత్యేకంగా వివరణ ఇచ్చింది. దీంతో ఆ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇదివరకే బిందు మాధవి తమిళ ఇండస్ట్రీలో కూడా కొన్ని సినిమాలు చేసింది.

ఇక బిగ్ బాస్ తెలుగు నాన్ స్టాప్ విన్నర్ గా నిలవడంతో మరికొన్ని ఆఫర్లు వచ్చాయి. అయితే ఆమె తొందర పడకుండా వీలైనంతవరకు మంచి కంటెంట్ ఉన్న డిఫెరెంట్ సినిమాలను చేయాలని అనుకుంది. ఇక అప్పుడప్పుడు స్టార్ సెలబ్రెటీలను కలుస్తున్న బిందు మాధవి రీసెంట్ గా కమల్ హాసన్ ను కూడా ఆమె స్పెషల్ గా కలిసినట్లు తెలుస్తోంది. ఇక ఆయనతో ప్రత్యేకంగా దిగిన ఒక పార్టీ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఇక బిందు మాధవి మరికొన్ని వెబ్ సీరీస్ లలో నటించేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











