‘గంటసాల’ బయోపిక్ రాబోతోంది, లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ పాత్ర పోషించేదెవరంటే?
ప్రస్తుతం టాలీవుడ్లో బయోపిక్ చిత్రాల ట్రెండ్ నడుస్తోంది. ఇప్పటికే సావిత్రి బయోపిక్ విడుదలై బాక్సాఫీసు వద్ద మంచి విజయం అందుకోగా... ఎన్టీఆర్ బయోపిక్, వైఎస్ఆర్ బయోపిక్ సెట్స్ మీద ఉన్నాయి. త్వరలో మరో తెలుగు సినీ లెజెండ్ బయోపిక్ తెరకెక్కించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
పోల్: బిగ్‌బాస్ తెలుగు 2 విజేతను మీరే తేల్చేయండి.. మీ ఓటు వేసేందుకు లింక్ క్లిక్ చేయండి!
ప్రముఖ తెలుగు సంగీత దర్శకుడు గంటసాల జీవితంపై బయోపిక్ తీసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇందులో సింగర్ కృష్ణ చైతన్య గంటసాల పాత్ర పోషించనున్నారు. అతడి భార్య మృదుల గంటసాల భార్య పాత్రలో కనిపించబోతున్నారట. గంటసాల జీవితంపై రీసెర్చ్ చేస్తున్న సిహెచ్ రామారావు ఈ ప్రాజెక్టుకు దర్శకత్వం వహించబోతున్నారు. 'ఘంటసాల... ది గ్రేట్' పేరుతో ఈ బయోపిక్ తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు.

గంటసాల బయోపిక్ విషయమై సిహెచ్. రామారావు ఓ పత్రికతో మాట్లాడుతూ. ''చిన్నప్పటి నుంచి నాకు ఘంటసాల పాటలంటే చాలా ఇష్టం. ఆయనంటే ప్రాణం. నేను చేసిన ఆయన పాటల సంకలనం ఇప్పటికి పదివేలకు పైగా కాపీలు అమ్ముడై రికార్డ్ క్రియేట్ చేసింది'' అని తెలిపారు.
''గంటసాల పాటలు ఎంత గొప్పగా ఉంటాయో... ఆయన వ్యక్తిత్వం కూడా అంతే గొప్పగా ఉంటుంది. ఆయన జీవితం ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. అలాంటి గొప్ప వ్యక్తి జీవితాన్ని సెల్యులాయిడ్ మీదకు ఎక్కించి భావితరాలకు ఆయన గురించి చెప్పాలనేది మా ఉద్దేశ్యం.' అని సిహెచ్ రామారావు తెలిపారు.
ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్. రాజేశ్వరరావు కుమారుడు, సాలూరి వాసూరావు ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం వహించనున్నారు. అన్యుక్త్‌రామ్ ప్రొడక్షన్స్ పతాకంపై గాయకుడు జి.వి. భాస్కర్ నిర్మాణ సారథ్యంలో లక్ష్మీనీరజ గంటసాల బయోపిక్ నిర్వించబోతున్నారు.


Click it and Unblock the Notifications











