అసలైన కథలకు సిసలైన డిమాండ్... అభిమానుల ఎదురుచూపులు
టాలీవుడ్ లో కొత్త కథలకు డిమాండ్ పెరుగుతోంది. ప్రేక్షకులు కొత్తదనం కోరుకుంటుండటంతో రైటర్లు తమ బుర్రలకు మరింత పదును పెడుతున్నారు. అయితే, పెరుగుతున్న డిమాండ్ కు తగ్గట్లు వినోదం పంచేందుకు షార్ట్ కట్ లు కూడా ఫాలో అవ్వాల్సి వస్తోంది. అలాంటి షార్ట్ కట్ ల్లో బయోపిక్ లు సింహ భాగాన్ని ఆక్రమిస్తున్నాయి.
ఇక మహానటి పుణ్యమాని తెలుగునాట బయోపిక్ లు విపరీతమైన డిమాండ్ పెరిగింది. దీంతో, ఓ సినిమాకు సరిపోయే స్టఫ్ ఉన్న వారి జీవిత కథలను కాచి వడబోస్తున్న సినీ జనం, పలు ఇంట్రెస్టింగ్ బయోపిక్ లతో బాక్సాఫీస్ పై దండయాత్ర చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగానే ప్రముఖ దర్శక -నిర్మాత దాసరి నారాయణ రావు, ఉదయ్ కిరణ్, ఆర్తీ అగర్వాల్ జీవిత చరిత్రలను తెరకెక్కించేందుకు రంగం సిద్ధమవుతోంది.

డైరెక్టర్ తేజ, రామ్ గోపాల్ వర్మ ఉదయ్ కిరణ్ బయోపిక్ ను తెరకక్కించేందుకు ఆసక్తి కనబరుస్తుండగా, స్టార్ డైరెక్టర్ అయిన దాసరి, లైపోసెక్షన్ వల్ల ప్రాణాలు కోల్పోయిన ఆర్తీ జీవితాలను తెర మీద ఆవిష్కరించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. దాసరి జీవిత చరిత్ర భారీ స్థాయిలో తెరకెక్కనుండగా, ఉదయ్, ఆర్తీల బయోపిక్ లు ఓటీటీ ప్లాట్ ఫార్మ్ ల కోసం ముస్తాబు అవుతున్నాయని ఫిల్మ్ నగర్ సమాచారం. మరి సినీ ప్రియులను ఈ బయోపిక్ లు ఏ విధంగా ఆకట్టుకుంటాయో చూడాలి.


Click it and Unblock the Notifications











