హాట్ టాపిక్: హీరోయిన్ డ్రెస్ ఛేంజ్ ఫోటోతో హీరో
హాట్ హీరోయిన్ బిపాసాబసు డ్రెస్ ఛేంజ్ చేసుకుంటున్న ఫోటోని ట్విట్టర్ లో పెట్టారు హీరో మాధవన్. మాధవన్, బిపాసాబసు జోడీ బ్రేకర్స్ ప్రమోషన్ లో భాగంగా ఇద్దరూ టూర్ వేస్తున్నారు. అప్పుడు ఆ స్టేజీపైనే బిపాసా బసు డ్రెస్ ఛేంజ్ చేసుకుంది. ఆ ఫోటోని తన ట్విట్టర్ లో పెట్టారు. అయితే ఆ ఫోటోలో ఇద్దరు బ్లాక్ మాస్క్ పట్టుకుని బిపాసాని కవర్ చేస్తూ ఫ్యాన్స్ ని డిజప్పాయింట్ చేస్తున్నారు. ఇక జోడీ బ్రేకర్స్ చిత్రం విషయానికి వస్తే... ఈ చిత్రంలో బిపాసాబసు హీరోయిన్ గా చేస్తోంది. ఇక మాధవన్, బిపాసాబసు కలిసి నటించటంపై అందరూ వింతగా చెప్పుకుంటున్న తరుణంలో మాధవన్ మాత్రం తమ జోడీ తెరపై మెరుపులు కురిపిస్తుందని చెప్పుకుంటున్నాడు.
''బిపాసా, నేను వెండితెరపై మంచి కెమిస్ట్రీ పండిస్తామని భావిస్తున్నా'' అని తెలిపాడు. రొమాంటిక్ కామెడీ చిత్రం 'జోడీ బ్రేకర్స్'కు అశ్వనీ చౌధరి దర్శకత్వం వహిస్తున్నారు. జంటలను విడగొట్టడమే పనిగా పెట్టుకునే మాధవన్, బిపాసా చివరకు ఎలా ప్రేమలో పడ్డారనేది చిత్ర కథ. ఫిబ్రవరి 24న విడుదల కానున్న ఆ చిత్రంలో ఓమి వైద్య, మిలింద్ సోమన్, తదితరులు నటిస్తున్నారు. అలాగే 'జోడీ బ్రేకర్స్' ఇప్పుడు కాపీ వివాదంలో చిక్కుకుంది. ఆ చిత్రం బెల్జియం చిత్రం హార్ట్ బ్రేకర్స్ కు కాపీ అంటూ హార్ట్ బ్రేకర్స్ చిత్రంకు చెందిన డిస్ట్రిబ్యూటర్స్ కంప్లైంట్ చేసారు.


Click it and Unblock the Notifications











