యుట్యూబ్ లో రాణా హీరోయిన్ సెక్సీ వీడియో
లీడర్ తో పరిచయమైన రాణా తన తదుపరి చిత్రం దమ్ మారో దమ్ లో హీరోయిన్ బిపాసాబసుతో కలిసి చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆమె అందాలు యూ ట్యూబ్ వేడిక్కిస్తోందని ఆ వీడియో చూసిన చూసిన కుర్రకారు కామెంట్స్ చేసుకుంటున్నారు. యూట్యూబ్ లో పెట్టిన బిపాసా బసు న్యూయార్క్ లాట్టో కమర్షియల్ యాడ్ చాలా బోల్డ్ గా ఉండటంతో దానికి విపరీతమైన రేటింగ్ వస్తోందని చెప్తున్నారు. ఆ యూఆర్ ఎల్ ని ఈ మెయిల్స్ ద్వారా ఒకరికొకరు పంపుకుని ఎంజాయ్ చేస్తున్నారు. ఆ యాడ్ లో వివేక్ ఒబరాయ్ తో బిపాసా శృంగారం ఒలకపోస్తూ కనపడుతుంది.
ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారం చేసిన ఆ యాడ్ అక్కడ వారికి మామూలుగా కనపించినా బోల్డ్ గా ఉన్న బిపాసా ఇక్కడ వారిని వెర్రిక్కిస్తోంది. ఇక ఈ విషయమై బిపాసాబసు మేనేజర్ మాట్లాడుతూ..బిపాసా ఆ యాడ్ ని 1999లో చేసింది. అప్పట్లో న్యూయార్క్ లోని ఫోర్డ్ మోడలింగ్ ఏజిన్సీ నిమిత్తం ఆమె పనిచేసేది. అప్పుడు చేసిన యాడ్ అది. ఎప్పుడు ఇంటర్నెట్ లో కనిపించటం ఆశ్చర్యంగా ఉంది అంటున్నాడాయన. అయితే బిపాసానే తన క్రేజ్ ని మరో సారి పెంచుకునేందుకు ఆ యాడ్ ని నెట్ లో పెట్టిందని కొందరు చెప్తున్నారు.


Click it and Unblock the Notifications











