రానాతో పెళ్లి గురించి బిపాసా ట్వీట్
బిపాసాబసు,రానా ల కాంబినేషన్ లో గతంలో హిందీలో 'దమ్ మారో దమ్" చిత్రం వచ్చిన సంగతి తెలిసిందే. ఆ సినిమా చేసాక వారిద్దరి మద్యా రిలేషన్ ముందుకెళ్ళిందంటూ వార్తలు వచ్చాయి. అయితే రీసెంట్ గా ముంబైలో రామ్ గోపాల్ వర్మ డిపార్టమెంట్ షూటింగ్ లో ఉన్న రానా ..ఆమెతో కలిసి రెస్టారెంట్ లలో తిరగటం మీడియా కళ్లపడింది.దాంతో వారు...ఆమెను రానా పెళ్ళి చేసుకోబోతున్నాడంటూ వార్తలు ప్రచురించేసారు.
ఇది విన్న బిపాసా..ఆ మాటలను కొట్టి పారేస్తూ...తన ట్విట్టర్ లో ...నేను రానాను పెళ్లి చేసుకోబోతున్నానని వార్తలు మీడియాలో వస్తున్నాయి. వాటిల్లో నిజం లేదు అని ఖండిస్తూ ట్విట్ చేసింది.గతంలోనూ ఆమె మీడియాతో మాట్లాడుతూ.. మహేష్‌బాబుతో 'టక్కరి దొంగ" చేశాను. భాషపరమైన సమస్యల వల్ల ఆ తర్వాత తెలుగులో చేయలేదు. కానీ, రానా హీరో అయితే మాత్రం తెలుగులో చేస్తాను. తన దగ్గర్నుంచి భాష నేర్చుకుంటాను అంటూ చెప్పుకొచ్చింది. ఇక డిపార్టమెంట్ విషయానికి వస్తే అమితాబ్, సంజయ్ దత్ వంటి బాలీవుడ్ స్టార్స్ చేస్తున్న ఈ సినిమాలో మంచు లక్ష్మీ ప్రసన్న, మధుశాలిని కూడా నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











