twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వాళ్లని గుర్తు చేసుకునేది చనిపోయాకే: బిపాసా

    By Bojja Kumar
    |

    ముంబై: పోయినోళ్లంతా మంచోళ్లు, ఉన్నోళ్లు పోయినోళ్ల తీపిగుర్తులు అనే విధంగా బిపాసా వేదాంతం వళ్లిస్తోంది. సూపర్ స్టార్‌లు కూడా ఏదో ఓ సమయంలో తెరమరుగు కాక తప్పదనీ, వాళ్లని మనం గుర్తు చేసుకునేది వాళ్లు చనిపోయాకేననీ సినిమా సత్యం చెప్పింది.

    మనం ఇష్ట పడేవాళ్లు మనకు దూరం కావడం మనసుకి చాలా కష్టం కలిగించే సంగతి. బాధాకరం. కానీ నటుల జీవితం ఇంతే. వాళ్ల జీవితాల్లో ఏదీ శాశ్వతం కాదు. పెద్ద పెద్ద సూపర్‌స్టార్‌లకే ఇది తప్పలేదని తెలిపింది. ఇందుకు పెద్ద ఉదాహరణ బాలీవుడ్ తొలి సూపర్‌స్టార్ రాజేశ్‌ఖన్నా. ఓ దశాబ్ద కాలం నుంచీ ఆయన గురించి వచ్చిన వార్తలు అతి స్వల్పం. ఆయన తీవ్ర అస్వస్థతకు గురై హాస్పిటల్ పాలైనప్పుడు ఆయన గురించి వార్తలు వచ్చాయి. మళ్లీ ఆయన గురించి చెప్పుకుంది చనిపోయాకే.

    "ఒకసారి పేరొచ్చాక, ఇంకా పని చేయాలని కోరుకుంటామే కానీ మనల్ని జనం మరచిపోవాలని కోరుకోం. ప్రపంచవ్యాప్తంగా ఏ నటులకైనా ఇదే విధమైన భావోద్వేగం ఉంటుంది అంటోంది బిపాషా. బిపాసా ప్రస్తుతం రాజ్-3 చిత్రంలో నటిస్తోంది.

    ఇమ్రాన్ హష్మీ హీరోగా నటిస్తున్న రాజ్-3 చిత్రం సెప్టెంబర్‌ 7న విడుదల కానుంది. బిపాసాతో పాటు ఇషా గుప్తా, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఇతర పాత్రలు పోషించారు. జీత్ గంగూలీ, రషీద్, మిథున్ సంగీతం అందించారు. మహేష్ భట్ నిర్మాత.

    English summary
    “The biggest of superstars are remembered only when they die. But what do you do? It is very sad, but that is the way it is. Nothing is permanent in life,” Bipasha told.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X