బిపాసాను వెంటాడిన రష్యన్ లవర్
టాలీవుడ్ బ్యూటీ బిపాసా బసుకు ఈ మధ్య భయంకరమైన అనుభవం ఎదురైంది. రిస్కీ మరియు డేంజరస్ ఇన్సిడెంట్ నుంచి మొత్తానికి భయట పడింది ఈ డస్కీ బ్యూటీ. ఇటీవల బిపాసా రష్యా ట్రిప్ కు వెళ్లింది. అక్కడి సెయింట్ పీటర్‌బర్గ్ లోని స్థానిక మార్కెట్ లో బిపాస సంచరిస్తుండగా ఆమెను ఆరాధిస్తూ, అభిమానిస్తూ, ప్రేమిస్తున్న ఓ అబిమాని ఆమెను వెంటాడటం ప్రారంభించాడు.
ముంబై మిర్రర్ వర్గాల నుంచి నుంచి అందిన సమాచారం ప్రకారం....బిప్స్ ఆ మార్కెట్ లో ఎక్కడ తిరిగితే ఆక్కడికి ఫాలో చేయడం ప్రారంభించాడు. అతని వ్యహారశైలి, చూపులు చూస్తే తనను ఏమైనా చేస్తాడేమో? అనే భయం ఆ క్షణంలో బిపాసాను ఆందోళనకు గురి చేసింది. అతని నుంచి తప్పించుకోవడానికి వేగంగా నడుస్తూ ఓ కాఫీ షాపులోకి వెళ్లింది. అయినా సరే అతడు బిపాసాను వదలలేదట. మొత్తానికి తన కోస్టార్ సహాయంతో ఆ రసహ్య ప్రేమికుడి నుంచి తప్పించుకుందట బిపాస. ఆ భయంకరమైన అనుభవం గురించి తన సన్నిహితులతో చెబుతూ....ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుకుండా బయట పడ్డందుకు ఆనందంగా ఉందని చెబుతుందట.
తన బాయ్ ఫ్రెండ్ జాన్ అబ్రహంతో విడి పోయిన తర్వాత....ఇలాంటి ప్రదేశాల్లో బిపాసకు అండగా నిలిచే మగాడే మళ్లీ దొరకలేదు. ఇలాంటి సందర్భాల్లో ధైర్యంగా ఉండేందుకు బిపాస కొత్త బాయ్ ఫ్రెండ్ కోసం అన్వేషిస్తోందని, మన తెలుగు హీరో దగ్గుబాటి రాణాపై ఆమెకు కోరిక ఉన్నా....మనోడు ఆమెను పట్టించుకోవడం లేదని అంటున్నారు.


Click it and Unblock the Notifications











