కస్టమ్స్ కన్నుగప్పిన బిపాసా బసు అరెస్ట్..విడుదల..!?
బాలీవుడ్ నటి బిపాసాబసు అరెస్ట్ అయ్యారు. లండన్ నుంచి తిరిగి ముంబై వస్తుండగా ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారులు చెక్ చేశారు. ఆమె వద్ద అనధికారికంగా డబ్బు, ఆభరణాలు ఉండటంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కస్టమ్స్ డ్యూటీ చేల్లించాకా ఆమెను తిరిగి వదిలిపెట్టారు. అయితే ఇదే విధంగా పది రోజలు క్రితం మనీష్ లాంబా కూడా ముంబై పోలీసులకు దొరికిపోయారు. ఆమె కూడా ఫైన్ చెల్లించి వెళ్లిపోయారు.
ఈ మధ్య బాలీవుడ్ నటీనటులు విదేశాల్లో షాపింగ్ చేసుకొని వచ్చేటప్పుడు ఉద్దేశపూర్వకంగా టాక్స్ ఎగ్గొడ్డానికి ప్రయత్నించి ఈ విధంగా దొరికిపోతున్నారు. వీరు కూడా మమ్మల్ని ఎవరూ చెక్ చేస్తారు. మేం సెలబ్రిటీస్ మనే ధోరణిలో రావడం వల్ల జనంలో చులకనవుతున్నారు. అయితే వారికి అక్కడ ఎక్కువగా బహుమతుల రూపంలో వస్తుంటాయి కాబట్టి వాటికి చెల్లించాల్సినవసరం లేదనుకోవడం ఒకటైతే, వెళ్లిపోవచ్చులేనన్న భరోసా వీరిని ఇలాంటి ఘటనలకు ప్రోత్సహిస్తుందని కొంతమంది టాక్స్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు...


Click it and Unblock the Notifications











