ఐటం సాంగ్ చేయటానికి ఆమె రేటు అక్షరాలా కోటి
బాలీవుడ్ సెక్సీ బ్యూటీ బిపాసా బసు ఐటం సాంగ్ కి కోటి రూపాయలు తీసకుని కొత్త రికార్డు క్రియోట్ చేసింది. ఈ సాంగ్ మర్డర్ -2 చిత్రం కోసం చేస్తోంది. ఈ విషయమై ఆమె మీడియాతో మాట్లాడుతూ..''రెమ్యునరేషన్ గురించి ఇప్పుడేం మాట్లాడలేను. ఐటమ్ సాంగ్ చేస్తున్న మాట మాత్రం నిజం. 'దమ్ మారో దమ్"లో దీపిక చేసిన ఐటమ్ నంబర్ రిలీజ్ కాకముందే సెన్సేషన్ క్రియేట్ చేయడం నన్నెంతో ఆకట్టుకుంది. అలా నేనెందుకు చేయకూడదు అనిపించింది. అందుకే ఈ సినిమాలో చేస్తున్నాను. నా కెరీర్‌లోనే కాదు... ఇండస్ట్రీలోనే ఈ పాట ఓ సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది"" అంది. ఇక త్వరలో విడుదల కానున్న 'దమ్ మారో దమ్"లో దీపికా పదుకొనే చేసిన ఐటమ్ సాంగ్ సినిమా విడుదలకు ముందే సంచలనాన్ని క్రియేట్ చేస్తోంది. అలాగే 'తీస్‌మార్ ఖాన్"లో కత్రినా, 'దబాంగ్"లో మల్లికా అరోరా ఐటమ్ సాంగ్స్ కూడా బాలీవుడ్ ని ఒక ఊపు ఊపిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











