రాణాకి పూర్తిగా సహకరిస్తోన్న బిపాసా బసు...
'దమ్ మారో దమ్" సినిమా ద్వారా దగ్గుబాటి రాణా హిందీ రంగ ప్రవేశం చేస్తున్నాడు. అభిషేక్ బచ్చన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్ గా బిపాసా బసు, మరో ముఖ్యపాత్రలో రాణా నటిస్తున్నారు. ఇందులో తన పాత్రకు తనే డబ్బింగ్ చెప్పుకోవాలని రాణా చాలా పట్టుదలతో ఉన్నాడంట. పలికే ప్రతీ పదాన్నీ నటుడిగా ఎలా ఉచ్ఛరించాలో జాగ్రత్తలు తీసుకుంటున్నాడంట. అతని సిన్సియారిటీ చూసి సహ నటి బిపాసా బసు తగిన సహకారం కూడా అందిస్తోందంట. ఈ విషయాన్ని తన ట్విట్టర్ లో పేర్కొంది. కానీ అసలు విషయమేమంటే…రాణాకు తెలుగుతోపాటు, హిందీ కూడా బాగావచ్చు. హైదరాబాద్ లో పుట్టి పెరగటం ఒక కారణమైతే, ముంబైలో యాక్టింగ్ ఇనిస్టిట్యూట్ లో శిక్షణ తీసుకోవటం మరో కారణం. బాలీవుడ్ లో ప్రవేశించాలని ముందు నుంచీ ఆలోచనలు ఉండటం వల్ల ఆ దిశగా సన్నాహాలు చేసుకున్నాడంట.
రాణా బిపాసా బసు అభిషేక్ బచ్చన్ దమ్ మారో దమ్ లీడర్ బాలీవుడ్ rana bipasha basu abhishek bachchan dum maro dum leader bollywood


Click it and Unblock the Notifications