Bipasha Basu : గుండెలో 2 రంధ్రాలు, సర్జరీ.. కన్నీళ్లు పెట్టుకున్న బిపాసా బసు..
బాలీవుడ్ హీరోయిన్ బిపాసా బసు, కరణ్ సింగ్ గ్రోవర్ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈ జంట గత ఏడాది నవంబర్ లో తమ మొదటి బిడ్డ కుమార్తె దేవికి జన్మనిచ్చారు. ఆ క్రమంలో తరచుగా వారి చిన్నారుల ఫోటోలు, వీడియోలను కుటుంబ సభ్యులతో సహా అభిమానులతో పంచుకున్నారు. అయితే తన పాప గురించి ఆసక్తి కర విషయాలు చెప్పి.. ఆవేదన చెందింది. అసలు ఏం జరిగిందంటే...
బాలీవుడ్ హీరోయిన్ బిపాసా బసు గతేడాది నవంబర్ లో పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఇక తన కూతురికి దేవి అని నామాకరణం చేశారు. ఇక తన భర్త కరణ్ సింగ్ గ్రోవర్, కూతురు దేవికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ బిపాస తన సంతోషాన్ని పంచుకుంటుంది. కానీ తాజాగా తన ఇన్ స్టాలో లైవ్ సెషన్ లో కన్నీరు పెట్టుకుంది బిపాస బసు.

నేహా ధూపియాతో లైవ్ సెషన్ లో బిపాసా బసు పాల్గొని భావోద్వేగానికి గురయ్యారు. తన కూతురు దేవి గుండెలో 2 రంధ్రాలు ఉన్నాయని చెబుతూ కన్నీరుమున్నీరయింది బిపాస బసు. కేవలం 3 నెలల వయసులోనే తన కూతురి గుండెలో 2 రంధ్రాలు ఉన్నాయని చెప్పుకొచ్చింది. ఆ చిన్నారికి వైద్యులు ఎలా ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాల్సి వచ్చిందో చెబుతూ కన్నీరు మున్నీరయ్యారు.
ఇక బిపాసకు పాప పుట్టిన మూవవ రోజే ఈ షాకింగ్ విషయం తెలిసిందని చెప్పుకొచ్చింది. అయితే ఎవరికీ దీని గురించి చెప్పుకోకూడదని అనుకున్నామని చెప్పుకొచ్చింది. కానీ ఈ ప్రయాణంలో తనకు సాయం చేసిన తల్లులు చాలా మంది ఉన్నారని భావిస్తున్నట్లు వెల్లడించింది.

బిపాస బసు మాట్లాడుతూ... పాప గుండెకు రంధ్రాలు ఉన్నాయని మాకు మూడు రోజుల తర్వాత తెలిసింది. చిన్నారి నయం అవుతుందో లేదో తెలుసుకోవడానికి ప్రతి నెల గుండెకు స్కాన్ చేయాల్సి ఉంటుందని వైద్యులు చెప్పారు. కానీ శస్త్ర చికిత్స చాలా కఠినమైనది. పెద్ద రంధ్రాలు అని.. సర్జరీ కచ్చితంగా చేయాలన్నారు వైద్యులు. కానీ మూడు నెలల వయసులో శస్రచికిత్స చాలా కష్టమని.. కానీ చివరి వరకు సర్జరీ కోసం వెయిట్ చేసి అంగీకరించాము. " అంటూ చెప్పుకొచ్చింది.
ఎంతో కాలం మానసిక సంఘర్షణ తర్వాత ఓపెన్ హార్ట్ సర్జరీ ద్వారా తమ బిడ్డను ఎలా కాపాడుకున్నామని... మూడు నెలల వయసులో వైద్యులతో మాట్లాడి అన్ని జాగ్రత్తలు తీసుకుని సర్జరీకి అంగీకరించామని అన్నారు బిపాసా. ప్రస్తుతం తన కూతురు ఆరోగ్యంగా ఉందని.. ఇలాంటి సున్నితమైన అంశాలను ప్రతి తల్లికి తెలియాలని ఈ విషయాన్ని బయటపెడుతున్నట్లు తెలిపింది. తన కూతురు ఆపరేషన్ థియేటర్లో ఉన్న 6 గంటలు నా జీవితం ఆగిపోయినట్లు అనిపించిందని తెలిపింది బిపాసా.


Click it and Unblock the Notifications











