బిపాసా బసు ‘లేడీ గుండా’

కాలేజీ రోజుల్లో తనను ఎవరైనా ఆట పట్టిస్తే వారిని ఓ చూపు చూసే వరకు వదిలేది కాదట, ఇక ఈవ్ టీజింగ్ లాంటి చేస్తూ తనను ఇరిటేట్ చేస్తున్న వారిని తన దైన శైలిలో హ్యాండిల్ చేస్తూ వారికి మూడు చెరువుల నీళ్లు తాగించేదట. అందుకే కొన్ని సందర్భాల్లో గుండా గిరి ప్రదర్శించకుంటే కుదరదుఅని చెబుతోంది ఈ భామ.
ప్రస్తుతం బిపాసా ప్లేయర్స్, జోడి బ్రేకర్స్, రాజ్ 3డి, రేస్ 2 చిత్రాల్లో నటిస్తోంది. ఇక ఆమె వ్యక్తిగత విషయాలపై దృష్టి పెడితే ఇటీవలే తన మాజీ లవ్వర్ జాన్ అబ్రహంతో విడిపోయిన బిపాస, కొత్త తోడును వెతుక్కనే పనిలో ఉంది. మన తెలుగు హీరో రాణా బిపాసాతో 'సం'బంధం నడిపిస్తుందనే గుసగుసలు కూడా బాలీవుడ్ లో వినిపిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











