»   » బిపాసా బసు పెళ్లి చేసుకోబోతోంది, అతడేనా? (ఫోటో ఫీచర్)

బిపాసా బసు పెళ్లి చేసుకోబోతోంది, అతడేనా? (ఫోటో ఫీచర్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: గతంలో జాన్ అబ్రహం, డినో మోరియా, హర్మాన్ భవేజా లాంటి వారితో డేటింగ్ చేసినా బాలీవుడ్ సెక్సీ స్టార్ బిపాసా బసు ప్రస్తుతం ‘హేట్ స్టోరీ-3' నటుడు కరణ్ సింగ్ గ్రోవర్ తో సన్నిహితంగా ఉంటున్న సంగతి తెలిసిందే. తామిద్దరం డేటింగ్ చేస్తున్నట్లు వీరు ఏనాడూ ఓపెన్‌గా చెప్పకపోయినా... చూసి వారికి మాత్రం ఇద్దరి మధ్య సంబంధం ఉందని స్పష్టం అవుతోంది. ఇద్దరు కలిసి జిమ్ సెక్స్ భంగిమల్లో వర్కౌట్లు చేయడం, ఇద్దరూ కలిసి విదేశాల్లో విహరించడం, పార్టీల్లో పాల్గొనడం, దీవాళి సెలబ్రేట్ చేసుకోవడం లాంటివే ఇందుకు నిదర్శనం.

అయితే ఇటీవల ఓ సందర్భంలో బిపాస బసు పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించింది. క్రికెటర్ యువరాజ్ సింగ్ అతని గర్ల్ ఫ్రెండును పెళ్లాడబోతున్న నేపథ్యంలో బిపాసా బసు ట్విట్టర్ ద్వారా విషెస్ చెప్పింది. దీనికి యువరాజ్ సింగ్ రిప్లై ఇస్తూ ఇపుడు నీ వంతు, నువ్వు ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు? అంటూ ప్రశ్నించాడు. త్వరలోనే నేను కూడా పెళ్లి చేసుకుంటాను అంటూ బిపాసా బసు రిప్లై ఇచ్చింది.

బిపాసా బసు గతంలో జాన్ అబ్రహం, డినో మోరియా, హర్మాన్ భవేజాలతో ప్రేమాయణం నడపటంతో పాటు డేటింగ్ చేసింది. అయితే వీరితో ఆమె బంధం పెళ్లి వరకు వెళ్లలేదు. ప్రస్తుతం ఆమె కరణ్ సింగ్ గ్రోవర్ తో సన్నిహితంగా ఉంటోంటి. కరణ్ సింగ్ గ్రోవర్ కు కూడా గతంలో చాలా బ్రేకప్స్ అయ్యాయి. 2008లో తన గర్ల్ ఫ్రెండ్ శ్రద్ధా నిగమ్ ను పెళ్లాడిన కరణ్ 2008లో ఆమెతో విడిపోయాడు. తర్వాత టివి నటి జెన్నిఫర్ విన్‌జెట్ ను 2012లో పెళ్లాడాడు. అయితే వీరి బంధం సంవత్సరన్నర కాలంలోనే బిచ్చిన్నం అయి విడాకులు తీసుకున్నారు.

ప్రస్తుతం బిపాసా బసు, కరణ్ సింగ్ గ్రోవర్ సన్నిహితంగా ఉంటున్న నేపథ్యంలో ఇద్దరూ పెళ్లి చేసుకునే అవకాశం ఉన్నట్లు ఊహాగానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే కొందరు మాత్రం ఇద్దరికీ పెళ్లి చేసుకునే ఉద్దేశ్యం లేదని, పెళ్లి చేసుకోకుండానే ఇద్దరూ కలిసి ఎంజాయ్ చేయడానికి ఆసక్తి చూపుతున్నారని అంటున్నారు.

కరణ్-బిపాస
  

కరణ్-బిపాస

కరణ్ సింగ్ గ్రోవర్, బిపాసా బసు ఇద్దరూ గత కొంత కాలంగా సన్నిహితంగా మెలుగుతున్నారు. కలిసి వర్కౌట్లు చేయడం, పార్టీలు, హాలీడే ట్రిప్స్ ఎంజాయ్ చేసారు. దివాళి కూడా కలిసే సెలబ్రేట్ చేసుకున్నారు.

త్వరలో పెళ్లి
  

త్వరలో పెళ్లి

యువరాజ్ సింగ్ కు రిప్లై ఇస్తూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు బిపాసా వెల్లడించింది.

అతడినే పెళ్లాడబోతోందా?
  

అతడినే పెళ్లాడబోతోందా?

ప్రస్తుతం బిపాసా బసు కరణ్ తో ఎఫైర్ కొనసాగిస్తున్న నేపథ్యంలో అతన్నే పెళ్లాడబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

కామెడీ నైట్స్ విత్ కపిల్
  

కామెడీ నైట్స్ విత్ కపిల్

బిపాసా బసు, కరణ్ కలిసి ఎలోన్ చిత్రంలో కలిసి నటించారు.

మేరా నంబర్ ఆగయా
  

మేరా నంబర్ ఆగయా

యువర్ సింగ్ పెళ్లి ఎప్పుడు అడగ్గానే... మేరా నంబర్ బి ఆగయా అంటూ బిపాసా రిప్లై ఇచ్చింది.

పీకల్లోతు ప్రేమలో..
  

పీకల్లోతు ప్రేమలో..

బిపాసా బసు, కరణ్ సింగ్ గ్రోవర్ ప్రస్తుతం పీకల్లోతు ప్రేమలో ఉన్నారు.

ఇద్దరికీ బ్రేకప్స్
  

ఇద్దరికీ బ్రేకప్స్

బిపాసాతో పాట, కరణ్ సింగ్ గ్రోవర్ కు కూడా గతంలో ఎఫైర్లు, బ్రేకప్స్ ఉన్నాయి.

కరణ్-బిప్స్
  

కరణ్-బిప్స్

కరణ్ సింగ్ కు ఇప్పటికే రెండు వివాహాలు....ఇద్దరితోనూ విడాకులు అయ్యాయి.

హేట్ స్టోరీ 3
  

హేట్ స్టోరీ 3

ప్రస్తుతం కరణ్ సింగ్ గ్రోవర్ హేట్ స్టోరీ 3 సినిమాలో నటిస్తున్నాడు.

గోవాలో పార్టీ
  

గోవాలో పార్టీ

గోవాలో పార్టీ చేసుకుంటున్న బిపాసా బసు, కరన్ సింగ్ గ్రోవర్

గ్రాండ్ రిలీజ్
  

గ్రాండ్ రిలీజ్

కరణ్ సింగ్ గ్రోవర్ నటించిన ‘హేట్ స్టోరీ 3' డిసెంబర్ 4న గ్రాండ్ గా రిలీజవుతోంది.

Please Wait while comments are loading...