వామ్మో..! ఇదేం యోగా బిపాషా..? హాట్ అండ్ సెక్సీ గా

బాలీవుడ్ బ్యూటీ బిపాషా బసు భర్త కరణ్ సింగ్ గ్రోవర్‌తో కలిసి చాలా చాలా హాట్ యోగాసనాలు వేసి ఆ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.

బాలీవుడ్ బ్యూటీ బిపాషా బసు కెరీర్ లో ఉన్నన్ని సంవత్సరాలు హాట్ హాట్ లుక్స్ తో జనాలకు మత్తెక్కించింది. గతేడాది కరణ్ సింగ్ గ్రోవర్ ను పెళ్లి చేసుకున్న ఈ భామ.. సినిమాలకు దూరమైపోయింది. ఇంటర్నేషనల్ యోగ డే సందర్భంగా ఈ వైఫ్ అండ్ హజ్బెండ్ ఇద్దరూ కలిసి స్పెషల్ ఆసనాలు వేశారు. ఇద్దరూ స్పెషల్ గా యోగాసనాలు వేసి కొత్తగా ట్రై చేశారు. యోగ డే సందర్భంగా ఆసనాలు వేయడంలో విచిత్రమేమీ లేదు కానీ.. ఇక్కడ ఇద్దరూ ఆసనాలు వేయడమే అసలైన విశేషం.

ఇద్దరూ కలిసి ఆసనాలు

ఇద్దరూ కలిసి ఆసనాలు

మామూలుగానే తను యోగ చేసే వీడియోలను సోషల్ మీడియాలో చూపిస్తుంటుంది బిపాషా. కానీ ఇక్కడ మాత్రం.. ఈ ఇద్దరూ కలిసి ఆసనాలు వేసేస్తున్నారు. ఒకరిపై ఒకరు.. ఒకరి కింద మరొకరు కనిపిస్తూ.. మరీ చిత్ర విచిత్రంగా ఉన్నాయి ఈ ఆసనాలు. భర్త కరణ్ సింగ్ గ్రోవర్‌తో కలిసి చాలా చాలా హాట్ యోగాసనాలు వేసి ఆ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.

యోగా క్రమం తప్పక చేస్తుండాలని

యోగా క్రమం తప్పక చేస్తుండాలని

వీటికి తోడు యోగా వల్ల జీవితంలో సమతుల్యత వస్తుందని కామెంట్ పెట్టింది. యోగా అనేది అద్భుతమైన ఫలితాలు ఇస్తుందని, యోగా క్రమం తప్పక చేస్తుండాలని భార్యాభర్తలిద్దూ పిలుపునిచ్చారు. ప్రేమను శ్వాసగా తీసుకుని, ద్వేషాన్ని వదలాలని బిపాషా అంది. ఈ ఆసనాలకు బిపాషా జంట ఏం పేరు పెడుతుందో తెలీదు కానీ..

హాట్ అండ్ సెక్సీ ఆసనాలు

హాట్ అండ్ సెక్సీ ఆసనాలు

ఇలా భార్యాభర్తలిద్దరూ కలిసి హాట్ అండ్ సెక్సీ ఆసనాలు చూపించడం మాత్రం హాట్ హాట్ ఇష్యూ అయిపోయింది. ఇక ఈ ఫొటోలతో బిపాషా గర్భవతి అంటూ వచ్చిన వార్తలకు కూడా చెక్ పెట్టినట్టయ్యింది. కొద్ది రోజుల క్రితమే తాను గర్భంతో ఉన్నట్లు ఇంటర్నెట్ లో వార్తలు జోరందుకోవడంతో బిపాషా స్పందించింది.

కరణ్ సింగ్ గ్రోవర్‌

కరణ్ సింగ్ గ్రోవర్‌

తాను తల్లిని కావడం లేదని స్పష్టం చేసింది. ఒకవేళ గర్భవతిని అయితే అందరికీ చెప్తాననీ తెలిపింది. కరణ్ సింగ్ గ్రోవర్‌ను పెళ్లి చేసుకున్న బిపాషా.. ఈ వార్తలను గట్టిగానే ఖండించింది. ఈ విషయమై ఆమె ఏకంగా మూడు ట్వీట్లు చేసింది. తాను గర్భవతిని అవ్వాలని చాలామందికి చాలా ఆత్రుతగా ఉందని, వాళ్ల ఆశాభావం బాగానే ఉంది గానీ, తనకు కాస్త ఇబ్బంది కలిగిస్తోందని చెప్పుకొచ్చింది.

ఏమీ ప్లాన్ చేసుకోవడం లేదు

ఏమీ ప్లాన్ చేసుకోవడం లేదు

తాను గర్భం దాల్చాలని తొందర పడుతున్న వాళ్లను నిరాశ పర్చుతున్నందుకు సారీ అంటూ ఓ ట్వీట్ లో పేర్కొంది. "ప్రస్తుతానికి మాకు పిల్లలు కావాలన్న ఏమీ ప్లాన్ చేసుకోవడం లేదు. ఒకవేళ అనుకుంటే అది చాలా సంతోషకరమైన విషయం కాబట్టి మేము శ్రేయోభిలాషులతో కూడా తప్పకుండా పంచుకుంటాం.

గర్భవతిని అవుతున్నానంటూ

గర్భవతిని అవుతున్నానంటూ

అయితే ప్రతిసారీ నేను గర్భవతిని అవుతున్నానంటూ ఊహాగానాలు ప్రచారం చేయడం మాత్రం సరికాదు. నేను బాగా ముక్కుసూటిగా ఉండే మనిషిని కాబట్టి ఏమైనా ఉంటే చెప్పేస్తా. అందువల్ల నా గురించి వస్తున్న కథనాలను నమ్మొద్దు" అని చెబుతూ అందరికీ ధన్యవాదాలు కూడా చెప్పేసింది బిపాషా.

తెరమీదకు రాకుండా

తెరమీదకు రాకుండా

అయినా ఎవరూ పెద్దగా నమ్మినట్టు కనపడలేదు దానికి తోడు తెరమీదకు రాకుండా దూరంగా ఉండటం వల్ల కూడా ఈ వార్తలకు బలం చేకూరింది. ఇప్పుడు ఈ హాట్ హాట్ యోగా ఫొటోలతో తాను గర్భవతి కాదన్న విషయం కూడా క్లారిఫికేషన్ వచ్చినట్టే మీరూ చూడండి ఈ హాట్ యోగాసనాలు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X