ప్రేమ మళ్లీ పుడుతుంది: బిపాసా
కొన్ని రోజుల క్రితం వరకు తన ప్రియుడు జాన్ అబ్రహంతో లవ్ లైఫ్ ను తనివితీరా అనుభవించిన బిపాసా బసు.....జాన్ తో విబేధాలు వచ్చి విడిపోయిన సంగతి తెలిసిందే. జాన్ అబ్రహం ప్రియా అనే మరో అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. అయితే బిపాసాకు మాత్రం ఇప్పటికు కొత్త లవ్వర్ దొరకలేదు. బిపాసా వాళ్లతో వీళ్లతో తెరచాటు ప్రేమాయణం సాగిస్తున్నట్లు గాసిప్స్ వినిపిస్తున్నా ఇప్పటి వరకు ఏ బంధం కూడా అఫీషియల్ గా ఖరారు కాలేదు.
ఇటీవల మీడియా బిపాసను ప్రశ్నిస్తూ....మీరు ఇప్పుడు సింగిల్ గా ఉన్నారు కదా, తోడు కోసం వెతుక్కోవడం లేదా? అని అడగ్గా. తోడు కావాలని నాకూ ఉంది కానీ వారి కోసం అన్వేషించే సమయం నాకు లేదు అని తెగేసి చెప్పేసింది. ఇద్దరు ప్రేమికుల మధ్య విబేధాలు వచ్చినప్పుడు విడి పోవడమే బెటర్. తమకు తగిన జోడీని వెతుక్కోవడమే కరెక్ట్ అంటోంది. ప్రేమ అనేది మళ్లీ పుడుతుంది అని చెప్పుకొస్తోంది.
బిపాస నటించిన జోడీ బ్రేకర్స్ చిత్రం ఇటీవల విడుదలై ఓ మోస్తరు విజయాన్ని సాధించింది. ఈ చిత్రాలతో పాటు ఆమె సింగులారిటీ, రాజ్ 3డి, రేస్ 2, గాయల్ రిటర్స్ అనే బాలీవుడ్ చిత్రాల్లో నటిస్తోంది.


Click it and Unblock the Notifications











