సెక్సీ సీన్లనే ప్రిఫర్ చేస్తానంటున్న హాట్ లేడీ
బాలీవుడ్ హాట్ లేడీ బిపాసా బసు ప్రియుడు జాన్ అబ్రహంతో విడిపోయాక ఒంటరిగానే ఉంటున్న సంగతి తెలిసిందే. అతడితో కలిసి ఉన్నప్పుడు లైఫ్‌ను ఎంత ఎంజాయ్ చేసిందో.....ఒంటరి జీవితాన్ని కూడా అదే రేంజ్లో ఎంజాయ్ చేస్తోంది. సినిమాల్లోకి వచ్చిన కొత్తలో ప్రియుడు జాన్ అబ్రహంతో అటు ఆన్ స్క్రీన్‌లోనూ, ఇటు ఆఫ్ స్క్రీన్‌లోనూ లిప్ లాక్ ముద్దు సీన్లు యమ రంజుగా పండించిన ఈ హాటీ....ఈ మధ్య ఆ సీన్లంటే విసుక్కుంటోంది. ముద్దు సీన్లు చేయడం అంటే తనకు చాలా భయం, తప్పనిసరి పరిస్థితుల్లో ఇబ్బంది పడుతూనే అలాంటి సీన్లు చేస్తున్న అంటూ కహానీలు చెప్పుకుంటూ వస్తోంది.
తాజాగా బిపాసా చెబుతున్న మాటేమిటో తెలుసా...లవ్ సీన్లు అందంగా రావడానికి ముద్దు సీన్లే ఉండక్కర్లేదు, సెక్సీగా రొమాన్స్ చేస్తూ కూడా చిత్రీకరించొచ్చు. నేనైతే అలాంటి వాటిని ప్రిఫర్ చేస్తానంటోంది. ప్రేక్షకులు కూడా ముద్దు సీన్ల కంటే రొమాంటిక్ మూడ్ తెచ్చే సీన్లనే ఇష్ట పడతారు అంటోంది.
ప్రస్తుతం బిపాసా బసు సింగులారిటీ, రాజ్ 3డి, రేస్ 2, గయాల్ రిటర్స్ అనే బాలీవుడ్ చిత్రాల్లో నటిస్తోంది. బిప్స్ నటించిన ప్లేయర్స్, జోడీ బ్రేకర్స్ చిత్రాలు ఈ సంవత్సరం విడుదలై ఓ మోస్తరుగా ఆడాయి.


Click it and Unblock the Notifications











