పోటీ హీరోయిన్ కి బిపాసా బసు చేతబడి
ఈ చిత్రం గురించి దర్శకుడు మాట్లాడుతూ.. ఒక ప్రముఖ హీరోయిన్ మైథిలీ (బిపాసాబసు) ఆదిత్య అనే దర్శకుడి ప్రేమలో పడుతుందన్నారు. వీరి ప్రేమాయ ణం సవ్యంగా సాగుతున్న తరుణంలో అంజలి అనే యువ నటి కారణంగా మైథిలీ ఎలాంటి సమస్యలను ఎదుర్కొంది? అనే పలు ఆసక్తికరమైన అంశాలతో కూడిన చిత్రం రాజ్-3 అని తెలిపారు. ఆద్యంతం సస్పెన్స్ థ్రిల్లర్ సన్నివేశంలో రూపొందిన ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 7న విడుదల చేయనున్నట్లు తెలిపారు.
2002లో విడుదలైన హిందీ చిత్రం రాజ్ సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. దానికి సీక్వెల్‌గా రూపొందిన రాజ్-2 చిత్రం కూడా మంచి హిట్ అయ్యింది. తాజాగా రాజ్-3 రానుంది. ఇది 3డి ఫార్మెట్‌లో రూపొందడం విశేషం. బిపాషా బసు, ఇషా గుప్తా సినీ తారలుగా నటించిన 'రాజ్ 3' సెప్టెంబర్ 7న విడుదలవుతోంది. ద డర్టీ పిక్చర్ మాదిరిగానే శృంగార రసాలు ఈ సినిమాలో పండాయని అంటున్నారు. హీరోయిన్ సినిమాపై కూడా అంచనాలు ఎక్కువే ఉన్నాయి. బిపాసా బుసుతో పాటు ఇషా గుప్తా కూడా రాజ్ 3లో తమ అందాలను ఆరబోశారని, ముద్దుల స్పెషలిస్టు ఇమ్రాన్ హష్మీ ఉండగా శృంగార దృశ్యాలకు కొదువేమీ ఉండదని అంటున్నారు
'ద డర్టీ పిక్చర్', 'హీరోయిన్' సినిమాలలో మాదిరిగానే 'రాజ్ 3'లోనూ అగ్రస్థాయికి వెళ్లిన సినీ తార ఎలా చివరకు పతనమయ్యిందనేది కథాంశం. కాకపోతే వాటిలో ఒక తార జీవితమే ప్రధానం కాగా, ఇందులో ఓ అగ్రతార, మరో వర్థమాన తార జీవితాలు కనిపిస్తాయి. తనకి పోటీగా తయారవుతున్న వర్థమాన తారను అణగదొక్కడానికి అగ్రతార ఏం చేసిందనేది ఇందులోని ప్రధానాంశం. అగ్రతారగా బిపాషా బసు, వర్థమాన తారగా ఇషా గుప్తా నటించారు. చిత్రానికి కథానాయకుడైన ఇమ్రాన్ హష్మి సినీ డైరెక్టర్ కేరక్టర్ చేశాడు.


Click it and Unblock the Notifications












