రాణాతో పెళ్లి వార్తలను కొట్టిపారేసిన బిపాషా
బాలీవుడ్ హాట్ లేడీ బిపాషా బసు చాలా ఏళ్లుగా తన సహచర నటుడు జాన్ అబ్రహంతో డేటింగ్ చేసిన విషయం తెలిసిందే. చాలా కాలం పాటు వీళ్ల ఎఫైర్ సినీ పరిశ్రమలో చర్చనీయాంశమైంది. త్వరలో వీళ్లు పెళ్లి చేసుకుంటారనే వార్తలు కూడా వినిపించాయి. ఒకరిపై ఒకరికి మోహం తగ్గిందో? ఏమోగానీ ఇద్దరూ విడిపోయారు. ఎవరి దారిన వారు పోయి ఒంటరిగా ఉంటున్నారు. జాన్ అబ్రహం తర్వాత బిపాషా ఎవరితో 'సం"బంధం నడిపిస్తుందంటే బాలీవుడ్ లో బలంగా వినిపిస్తున్న పేరు మన తెలుగు హీరో, రామానాయుడు మనవడు రాణా దగ్గుబాటి పేరే. ఆ మధ్య బాలీవుడ్ లో వచ్చిన 'దమ్ మారో దమ్" సినిమాలో ఇద్దరూ కలిసి రోమాన్స్ చేశారు. అప్పుడే ఇద్దరి మధ్య ప్రేమకు బీజం పడిందనే వార్తలు ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి.
జాన్ అబ్రహంకు ఏమాత్రం తీసిపోని అందం, పర్సనాలిటీ రాణాకు ఉంది. ఈ కారణంగానే బిపాషా రాణాపై మనసు పారేసుకుందని, అతనితో డేటింగ్ మొదలు పెట్టిందనే వార్తలు గుప్పుమన్నాయి. దీనికితోడు పలు పబ్లిక్, ప్రైవేట్ ఫంక్షన్ లలో ఇద్దరూ చాలా క్లోజ్ గా మూవ్ అవ్వడం కూడా ఇందుకు బలం చేకూర్చింది. కొన్ని రోజుల తర్వాత ఇద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారనే గుసగుసలు వినిపించాయి. అయితే ఈ వార్తలపై చాలా ఆలస్యంగా స్పందించిన బిపాషా...ఆ వార్తలను చెత్తవార్తలుగా పేర్కొంటూ ట్విట్టర్ లో పేర్కొంది. ఇలాంటి అకల్పితాలు ఎవరు పుట్టిస్తారో? ఎందుకు రాస్తారో అర్థం కాదు అంటూ మండి పడింది.


Click it and Unblock the Notifications











