గోవా బీచ్ లో హాట్ సుందరి ఫిట్ నెస్ వీడియో షూట్
గోవా బీచ్ త్వరలో బిపాసాబసు హాట్ వీడియో షూట్ తో వేడిక్కనుంది. శీతాకాలం వచ్చేలోగా ఈ వీడియో పని పూర్తిచేయాలని ఆమె ఆశిస్తోంది. ఈ విషయమై మాట్లాడుతూ...నేను గోవా అవుట్ డోర్ లో నా వీడియో షూటింగ్ పూర్తి చేయాలనుకుంటున్నాను. శీతాకాలంలో ఈ బీచ్ పూర్తిగా జనంతో నిండిపోతుంది...చాలా ఇబ్బంది అవుతోంది. అందులోనూ సెప్టెంబర్ లో ఓ సినిమా షూటింగ్ కూడా ఉంది. ఇంతకు ముందులా నాకు టీమ్ లేదు. ఇప్పుడు అంతా నా చేతులు మీదుగా నడుస్తోంది. ఒంటిరిగా ఒక్కదాన్నే అన్నిపనులూ చేస్తుంటే బోరింగ్ గా ఉంది అంది. ఇక ప్రస్తుతం బిపాసాబసు..తెలుగు హీరో రాణా సరసన దమ్ మారో దమ్ చిత్రంలో చేస్తోంది. రోహన్ సిప్పీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం కోసం ఓల్డ్ క్లాసిక్...హరేరామ హరేకృష్ణ లోని దమ్ మారో దమ్ సాంగ్ ని రీమిక్స్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











