Don't Miss!
- Finance
Google: ఉద్యోగుల తొలగింపు తర్వాత గూగుల్ మరో అడుగు.. ఏంటిది సుందర్ పిచాయ్..!
- Sports
Team India : సూర్యకుమార్‌పై మరీ ఎక్కువగా ఆధార పడుతున్న టీమిండియా..!
- News
మంత్రిపై కాల్పులు జరిపిన ఎస్ఐ- పాయింట్ బ్లాక్ రేంజ్లో
- Lifestyle
4-7-8 బ్రీతింగ్ టెక్నిక్ అంటే ఏంటి? ఇది ఆందోళనను తగ్గిస్తుందా?
- Automobiles
మార్కెట్లో విడుదలకానున్న కొత్త మారుతి కార్లు.. మరిన్ని వివరాలు
- Technology
20 లక్షల మంది Active వినియోగదారులను కోల్పోయిన Jio ! కారణం తెలుసుకోండి!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
ఆ ఫీల్ రాదేమో: బిపాసా బసు యుక్తవయసులో (రేర్ ఫోటోస్)
హైదరాబాద్: బాలీవుడ్ బ్యూటీల్లో హాట్ ఇమేజ్ సొంతం చేసుకున్న భామల్లో బిపాసా బసు ఒకరు. ప్రస్తుతం ఆమె వయసు 37 సంవత్సరాలైనా....ఆమెలో సెక్సీనెస్ ఏ మాత్రం తగ్గలేదు. ఇంత వయసు వచ్చినా బాలీవుడ్లో నెగ్గుకురావడానికి కారణం అదే.
ఇన్నాళ్లు కుర్రాళ్లను తన అందాలతో ఉక్కిరి బిక్కిరి చేసిన బిపాసా....ఎట్టకేలకు పెళ్లి చేసుకుంది. తన ప్రియుడు కరణ్ సింగ్ గ్రోవర్ ను రెండు రోజుల క్రితం పెళ్లాడింది. అలా అని అభిమానులు కంగారు పడాల్సిన పన్లేదు. పెళ్లాయినా సినిమాల్లో కొనసాగుతానని బిపాసా ప్రకటించింది.
ఇప్పుడంటే బిపాసా సెక్సీ షేపులతో, నిండైన అందాలతో అందంగా కనిపిస్తోంది. అయితే యుక్తవయసులో, మోడలింగ్ రంగంలోకి వచ్చిన రోజుల్లో బిపాసా ఎలా ఉండేదో చూస్తే మీరు షాకవ్వడం ఖాయం. అప్పటి బిపాసా ఫోటోలు చూస్తే సెక్సీ అనే ఫీలింగ్ రావడం కష్టమే.
టీనేజీ రోజుల్లోనే బిపాసా బసు మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టింది. తొలినాళ్లలో ఆమె ఎక్కువగా ప్రింట్ అడ్వర్టైజ్మెంట్లలో నటించింది. పలు టెలివిజన్ ప్రకటనల్లో నటించింది. అందుకు సంబంధించిన ఫోటోలపై మీరూ ఓ లుక్కేయండి.

బిపాసా బసు
మోడలింగ్ రంగంలోకి వచ్చిన తొలినాళ్లలో బిపాసా బసు ఇలా...

టీనేజీలోనే..
17 ఏళ్ల వయసులోనే బిపాసా బసు మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టింది.

ఫ్యామిలీ
బిపాసా బసు బెంగాళీ ఫ్యామిలీకి చెందిన వ్యక్తి. కోల్ కతా నుండి వారి ఫ్యామిలీ ఢిల్లీ వచ్చి స్థిర పడింది.

ఢిల్లీలోనే..
బిపాసా బసు ఢిల్లీలోనే పుట్టిపెరిగింది. ఇక్కడే చదువుకుంది.

టామ్ బాయ్‌లా
బిపాసా బసు చిన్నతనంలో టాబ్ బాయ్ లా ఉండేది. ఢిల్లీ వీధుల్లో మగరాయుడిలా తిరిగేది.

లేడీ గుండా
స్కూల్లో బిపాసా బసును అంతా లేడీ గుండా అని పిలిచేవారు. అంతా ఆమెను చూసి భయపడేవారట.

ఇద్దరు సిబ్లింగ్స్
బిపాసా బసుకు ఇద్దరు సిస్టర్స్ ఉన్నారు.

అలా మోడలింగ్ రంగంలోకి..
మోడల్ మెహర్ జెసియా ఒకసారి బిపాసాను కోల్ కతాలోని ఓ హోటల్ లో చూసి మోడలింగ్ రంగంలోకి వెళ్లమని సూచించిందట.

బిపాసా బసు
బిపాసా బసుకు కూడా మోడలింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉండటంతో అటువైపు అడుగులు వేసింది.

మోడలింగ్ కాంటెస్ట్
1996లో బిపిసా బసు గోద్రెజ్ సింథాల్ సూపర్ మోడల్ కాంటెస్ట్, ఫోర్డ్ మోడల్స్ సూపర్ మోడల్ ఆఫ్ ది వరల్డ్ కాంటెస్టులో గెలుపొందింది.

అవకాశాలు
ఈ రెండు కాంటెస్టులో గెలుపొందడంతో బిపాసా బసుకు మోడలింగులో అవకాశాలు వెల్లువెత్తాయి.

తొలి వివాదం
బిపాసా తన బాయ్ ఫ్రెండ్ డినో మెరియాతో కలిసి చేసిన కాలిడా అనే కమర్షియల్ చాలా హాట్ గా ఉండటంతో అప్పట్లో వివాదం చెలరేగింది.

ఆందోళనలు
ఆ వివాదం తర్వాత కొందరు వ్యక్తులు వచ్చి బిపాసా ఇంటిముందు ఆందోళన చేసారు.

40కిపైగా మేగజైన్లు
బిపాసా బసు ఇప్పటి వరకు 40కి పైగా మేగజైన్ల కవర్ పేజీలపై దర్శనమిచ్చింది.

తరంగ్రేటం
2011లో వచ్చిన అజనబీ చిత్రం ద్వారా బిపాసా బసు తెరంగ్రేటం చేసింది.

తెలుగులో...
తెలుగులో మహేష్ బాబు సరసన ‘టక్కరి దొంగ' చిత్రంలో బిపాస బసు నటించింది. ఇది ఆమె రెండో సినిమా.

వరుస అవకాశాలు..
అందగత్తె కావడం, ఎలాంటి సీన్లలో అయినా నటించే తెగువ ఉండటంతో బిపాసాకు వరుస అవకాశాలు వెల్లువెత్తాయి.

50కి పూగా చిత్రాల్లో..
బిపాసా బసు ఇప్పటి వరకు తన కెరీర్లో 50కి పైగా చిత్రాల్లో నటించింది.

ఎఫైర్లు
బిపాసా బసు గతంలో జాన్ అబ్రహంతో కొంతకాలం సహజీవనం చేసిన సంగతి తెలిసిందే.

బ్రేకప్
సుధీర్ఘ కాలం సహజీవనం చేసిన అనంతరం బిపాసా బసు, జాన్ అబ్రహం విడిపోయారు.

కొంతకాలం ఒంటరిగా
జాన్ అబ్రహంతో విడిపోయిన తర్వాత కొంతకాలం బిపాసా ఒంటరిగానే ఉంది.

పుకార్లు
అయితే మధ్యలో బిపాసా బసు మరికొందరు స్టార్లతో డేటింగ్ చేసినట్లు గతంలో పుకార్లు వినిపించాయి.

కరణ్ సింగ్ గ్రోవర్ తో..
కరణ్ సింగ్ గోవర్ తో బిపాసా బసు కొంతకాలంగా సహజీవనం చేస్తోంది.

ఎలోన్
బిపాసా బసు, కరణ్ సింగ్ ఎలోన్ అనే చిత్రంలో కలిసి నటించారు. ఆ పరిచయం కాస్త ఇద్దరి మధ్య ప్రేమ బంధానికి దారి తీసింది.

కొంతకాలం రహస్యంగా..
కొంతకాలం ఇద్దరి మధ్య రహస్యంగానే ప్రేమాయణం సాగింది.

పెళ్లి విషయంలో సస్పెన్స్
అయితే ఇద్దరు పెళ్లి చేసుకుంటారా? లేదా? అనే విషయంలో చాలా కాలం పాటు సస్పెన్స్ కొనసాగింది.

ఎట్టకేలకు...
ఎట్టకేలకు బిపాసా, కరణ్ సింగ్ ఇటీవల వివాహం చేసుకున్నారు.

బిపాసా బసు
బిపాసా బసు టీనేజ్ ఫోటోస్

బిపాసా బసు
బిపాసా బసు టీనేజ్ ఫోటోస్

బిపాసా బసు
బిపాసా బసు టీనేజ్ ఫోటోస్