twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    దగ్గుపాటి రాణా వెరీ హాట్ అంటున్న సెక్స్ బాంబ్

    By Srikanya
    |

    దగ్గుపాటి రాణా గురించి బాలీవుడ్ సెక్స్ బాంబ్ బిపాసా ఓ రేంజిలో ట్విట్టర్ లో పొగడ్తలు కురిపించేస్తోంది. ఆమె రాణాని చాలా హాట్ గా ఉంటాడని, తనకు రాణా లాంటి కో స్టార్ దొరకటం అదృష్టమని, అతనిలా ప్రెండ్షిప్ చేసే వ్యక్తి, విలువిచ్చే వ్యక్తి దొరకడని ఆమె అంటోంది. ఇత దమ్ మారో దమ్ చిత్రంలో రాణాతో నాకు మంచి సన్నివేశాలు కుదిరాయి. తను ఎంతో ఈజ్ ఉన్న ఆర్టిస్ట్. బాలీవుడ్‌లో తనకు బోలెడంత భవిష్యత్తు ఉందని అతని నటన చూస్తే అనిపించింది. మళ్లీ మళ్ళీ రాణాతో కలిసి నటించాలని ఉంది అని చెప్పుకొచ్చారు.ఇక దమ్ మారో దమ్ లో రాణా, బిపాసాలపై కూడా కొన్ని రొమాంటిక్ సన్నివేశాలు చిత్రీకరించారు దర్శకుడు రోహన్ సిప్పీ. ఆ సీన్స్ ఈ సినిమాకే హైలైట్‌గా నిలుస్తాయని చెప్తోంది. 'దమ్ మారో దమ్' ఏప్రిల్ 22న విడుదల కానుంది.

    రోహన్ సిప్పీ దర్శకత్వం లో రూపొందిన ఈ చిత్రంలో అభిషేక్ బచ్చన్, రాణా, బిపాషా బసు, ప్రతీక్ బబ్బర్ (రాజ్‌బబ్బర్ కుమారుడు) కీలకపాత్రలు పోషించారు. అలాగే ఈ చిత్రలో రాణా, బిపాషా జంటగా చేసింది.అలాగే దేవానంద్ సూపర్ హిట్ 'హరే రామ హరే కృష్ణ'లోని పాపులర్ సాంగ్ 'దమ్ మారో దమ్'ని ఈ సినిమాలో రీమిక్స్ చేశారు. ఆ పాటకి దీపికా పదుకోనే డాన్స్ చేసింది. డ్రగ్స్, సెక్స్, రాక్ అండ్ రోల్ పార్టీల నేపధ్యంలో ఈ చిత్రం రూపొందనుంది. గోవా నేపథ్యంలో రూపొందించిన ఈ చిత్రంలో అభిషేక్ బచ్చన్ పోలీస్ ఇన్‌స్పెక్టర్‌గా నటించాడు.

    అక్కడ స్ధానిక గోవా కుర్రాడుగా రాణా కీలక పాత్రని చేశాడు. రమేశ్ సిప్పీ ఎంటర్‌టైన్‌మెంట్, ఫాక్స్ స్టార్ స్టూడియోస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఇక 'దమ్ మారో దమ్' చిత్రంలో తన పాత్ర గురించి చెపుతూ... ' ఈ సినిమాలో నేను గోవా యువకుడిగా నటిస్తున్నాను. ఇందుకోసం గిటార్, బైక్ రైడింగ్ నేర్చుకున్నాను. సినిమాలో నేను కొంకిణి భాష మాట్లాడాలి. సినిమాకు ప్రత్యేకంగా డబ్బింగ్ చెప్పడమని ఉండదు. షూటింగ్ జరుగుతుండగానే వాయిస్ రికార్డ్ చేస్తారు అని చెప్పుకొచ్చారు.

    English summary
    'Dum Maaro Dum' is an upcoming thriller directed by Rohan Sippy and stars Abhishek Bachchan, Rana Daggubati, Bipasha Basu and Prateik Babbar.The film is set for an April 22, 2011 release date.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X