For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    స్టార్ హీరోయిన్, పాపం గుడ్లు కొనటానికి కూడా డబ్బుల్లేక అప్పు

    By Srikanya
    |

    ముంబై: దేశంలో ప్రస్తుతం చెలామణిలో ఉన్న పెద్ద విలువ కలిగిన రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంగళవారం రాత్రి ప్రకటించారు. ఈ ప్రకటన వెలువడిన కొన్ని గంటల్లోనే ఈ నోట్లన్నీ ఎందుకు పనికిరాని చిత్తుకాగితాల్లా మారిపోయాయిన సంగతి తెలిసిందే.

    దాంతో ఈ ప్రభావం చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అందరిపై పడింది. ప్రధాని నుండి ప్రకటన వెలువడినప్పటి జనం ఎటిఎం ల దగ్గర నిలబడటం, వంద రూపాయల నోట్లు కోసం నానా రకాలుగా ఇబ్బందులు పడ్డారు.

    అదే కోవలో బాలీవుడ్ హాట్ బ్యూటీ బిపాషాబసు కూడా పెద్ద నోట్ల కష్టం వచ్చింది. ఆమె దగ్గర ఐదు వందలు, వెయ్యి తప్ప మరే వేరే డబ్బు లేకపోవడంతో కోడిగుడ్లు కొనేందుకు కూడా వేరొకరి దగ్గర డబ్బులు అప్పుగా తీసుకోవాల్సి వచ్చిందట. ఈ విషయాన్ని బిపాసా స్వయంగా తన ట్విట్టర్ చెప్పింది బిప్స్.

    ఇక తన ప్రేగెన్సీ వార్తల పై కూడా క్లారీటీ ఇచ్చింది బిపాసా. బిపాసా కొన్నాళ్ల కిందట కరణ్ సింగ్ గ్రోవర్ ను వివాహం చేసుకుంది. బిపాసా తల్లి కాబోతోందని గత కొన్ని రోజులు ప్రచారం జరుగుతోంది. ఈ జంట తమతొలి సంతానాన్ని పొందబోతోందని వార్తలు వచ్చాయి. అయితే ఇదంతా ఉత్తుత్తి ప్రచారమే అని స్పష్టం చేసింది బిపాసా. ఈ ప్రచారంలో వాస్తవం లేదని కొట్టిపారేసింది.

    English summary
    PM Modi's decision to ban all the old 500-1000 notes prove to be sad for some while others praise this decision to bring an end to black or hoarded money. Actress Bipasha Basu had to borrow money to buy eggs. The star tweeted about her experience. The 'Alone' actress tweeted, "Just borrowed money from RockyStarWorld to buy eggs what a day!"
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X