ఆమె ఎప్పటికీ నా గర్ల్ ఫ్రెండ్ కాలేదు: రాణా
బాలీవుడ్ హాట్ లేడీ బిపాసా బసుతో రాణా 'సం'బంధం కొనసాగిస్తున్నట్లు అప్పట్లో మీడియాలో పుకార్లు షికార్లు చేసిన విషయం తెలిసిందే. అయితే రాణా చాలా సందర్భాల్లో తమ మధ్య అలాంటిదేమీ లేదని, తాము జస్ట్ స్నేహితులం మాత్రమే అని తేల్చి చెప్పాడు. తాజాగా మరోసారి రాణా ఈ విషయాన్ని నొక్కి చెప్పాడు. ఓ ప్రముఖ ఆంగ్ల పత్రికతో మాట్లాడుతూ...మేము కేవలం స్నేహితులం మాత్రమే, మా ఇంట్లో వాళ్లు చూసిన సంబంధమే చేసుకుంటా, సౌతిండియా అమ్మాయినే పెళ్లి చేసుకుంటానని స్పష్టం చేశాడు.
ఇటీవల తాను నటించిన డిపార్ట్‌మెంట్ చిత్రం ఆశించిన ఫలితాలను ఇవ్వక పోవడం, అందులో తన పాత్రకు సరైన గుర్తింపు రాక పోవడంపై స్పందిస్తూ....నాకు 6 సినిమాలు చేసిన అనుభవం మాత్రమే ఉంది. ప్రేక్షకులు మెచ్చే విధంగా పాత్రలను ఎంచుకునే ప్రయత్నం చేస్తాను అన్నారు.
ప్రస్తుతం రాణా 'కృష్ణం వందే జగద్గురుమ్' అనే చిత్రంలో నటిస్తున్నాడు. క్రిష్ దర్శకత్వంలో, సాయిబాబు జాగర్లమూడి, వై.రాజీవ్ రెడ్డిలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో హీరోపై కొన్ని సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.
ఈచిత్రంలో రాణా బీటెక్ బాబు పాత్రలో నటిస్తున్నాడు. చదివింది బీటెక్. అందుకే అన్నీ హైటెక్ తెలివి తేటలు. పుస్తకాల్లో చదివిన జ్ఞానం కంటే... జీవితాల్లోంచి గ్రహించిందే ఎక్కువ. ఎప్పటికయ్యది ప్రస్తుతం అప్పటికామాటలాడి... తప్పించుకొన్న శ్రీకృష్ణతత్వం బాగా అలవాటు చేసుకొన్నపాత్రలో నటించాడు. ఈ చిత్రంలో నయనతార హీరోయిన్ గా రాణా సరసన చేస్తోంది. నయనతార పాత్ర పేరు దేవిక. ఆమె డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్‌గా నటిస్తోంది.


Click it and Unblock the Notifications











