వర్ధమాన తారపై కత్తి కట్టిన బిపాసా
బిపాషా బసు, ఇషా గుప్తా సినీ తారలుగా నటించిన 'రాజ్ 3' సెప్టెంబర్ 7న విడుదలవుతోంది. 'ద డర్టీ పిక్చర్', 'హీరోయిన్' సినిమాలలో మాదిరిగానే 'రాజ్ 3'లోనూ అగ్రస్థాయికి వెళ్లిన సినీ తార ఎలా చివరకు పతనమయ్యిందనేది కథాంశం.
కాకపోతే వాటిలో ఒక తార జీవితమే ప్రధానం కాగా, ఇందులో ఓ అగ్రతార, మరో వర్థమాన తార జీవితాలు కనిపిస్తాయి. తనకి పోటీగా తయారవుతున్న వర్థమాన తారను అణగదొక్కడానికి అగ్రతార ఏం చేసిందనేది ఇందులోని ప్రధానాంశం. అగ్రతారగా బిపాషా బసు, వర్థమాన తారగా ఇషా గుప్తా నటించారు. చిత్రానికి కథానాయకుడైన ఇమ్రాన్ హష్మి సినీ డైరెక్టర్ కేరక్టర్ చేశాడు.
ద డర్టీ పిక్చర్ మాదిరిగానే శృంగార రసాలు ఈ సినిమాలో పండాయని అంటున్నారు. హీరోయిన్ సినిమాపై కూడా అంచనాలు ఎక్కువే ఉన్నాయి. బిపాసా బుసుతో పాటు ఇషా గుప్తా కూడా రాజ్ 3లో తమ అందాలను ఆరబోశారని, ముద్దుల స్పెషలిస్టు ఇమ్రాన్ హష్మీ ఉండగా శృంగార దృశ్యాలకు కొదువేమీ ఉండదని అంటున్నారు.


Click it and Unblock the Notifications












