బిపాసా నా ఫ్యామిలీ మెంబరే అంటున్న రాణా
దగ్గుబాటి యువహీరో రాణా బాలీవుడ్ మూవీ దమ్ మారో దమ్ సినిమాలో బాలీవుడ్ హాట్ బేబ్ బిపాసాతో కలిసి రొమాన్స్ చేసిన తర్వాత.....ఈ ఇద్దరి మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తుంది, బిపాస తన మాజీ బాయ్ ఫ్రెండ్ జాన్ అబ్రహంను వదిలేసి రాణాను తగులుకుందని రూమర్లు వినిపిస్తున్న విషయం తెలిసిందే. అయితే రాణా మాత్రం తమ మధ్య అలాంటిదేమీ లేదని, స్నేహం మాత్రం ఉందని తెగేసి చెప్పాడు. తాజాగా ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వూలో రాణా మాట్లాడుతూ..మరోసారి ఈ వార్తలను ఖండించారు.
'బిపాసా వెరీ స్వీట్ అండ్ నైస్ పర్సన్, మంచి స్నేహితురాలు, కానీ ఆమెను నేను పెళ్లి చేసుకోబోతున్నట్లు వస్తున్న వార్తల్లో మాత్రం నిజం లేదు. ఇలాంటి వార్తలు ఎలా వస్తాయో అర్థం కాదు, బిపాసా, రోహన్, దమ్ మారో దమ్ టీం నాకంటూ ముంబైలో ఉన్న స్నేహితులు...వారంతా నా ఫ్యామిలీ మెంబర్ల లాంటి వారు' అంటూ వ్యాఖ్యానించాడు.
బడా నిర్మాతల కుటుంబానికి చెందిన వాడు కావడంతో రాణాకు తెలుగుతో పాటు హిందీ తమిళంలో అవకాశాలు తన్నుకొస్తున్నాయి. ఇప్పటికే బాలీవుడ్ లో దమ్ మారో దమ్ చిత్రంలో నటించిన ఈ హీరో...తాజాగా రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న డిపార్టుమెంట్ చిత్రంలో పోలీసాఫీసర్ గా పవర్ ఫుల్ రోల్ పోషిస్తున్నాడు. మరో వైపు తమిళంలో 'వాడ చెన్నయ్' చిత్రంలో గెస్ట్ పాత్రలో నటిస్తున్నాడు. తెలుగులో రాణా-క్రిష్ కాంబినేషన్లో వస్తున్న 'కృష్ణం వందే జగద్గురుమ్' చిత్రం షూటింగు డిసెంబర్ 14న ప్రారంభం అయింది.


Click it and Unblock the Notifications











