మండోదరిగా !

By Staff

రావణాసురుడి భార్య అయిన మండోదరి మహా అందగత్తె అని పురాణాలు చెబుతాయి. ఆ పాత్రను వెండితెరపై ఎవరు పోషిస్తే బాగుంటుందనే విషయంపై గత కొంత కాలంగా చర్చలు జరుతుతున్నాయి. మణిరత్నం దర్శకత్వంలో మొదట నయనతారను నటించమని కోరారట. డేట్స్ అడ్జట్స్ కావడంలేదని ఈ కేరళ కుట్టి తిరస్కరించారని సమాచారం. ఆ తర్వాత ఈ పాత్ర సుస్మితాసేన్ని వెతుక్కుంటూ వెళ్లింది. కానీ, ఐశ్వర్యరాయ్ ఉన్న సినిమాలో నటించడానికి ఇష్టపడక సుస్మితా నిరాకరించారట. చివరకు ఈ పాత్ర బిపాసా బసుని వరించింది.

మణిరత్నం సినిమాలో అవకాశం అంటేనే గొప్ప విషయం. అందులోనూ అందగత్తె మండోదరిగా నటించే అవకాశం రావడం మరింత గొప్ప అని భావించి బిపాసా వెంటనే పచ్చ జెండా ఊపారట. ఈ గెటప్ కు సంబంధించిన కాస్ట్యూమ్స్ కూడా రెడీ అయ్యాయి. ఈ పాత్ర గురించి బహిరంగంగా మాట్లాడకూడదని బిపాసాకు మణిరత్నం నిబంధన విధించారట. దాంతో ఆమె మౌనం పాటిస్తున్నారు.

సెప్టెంబర్ రెండో వారంలో ఈ మండోదరి పాత్రకు సంబంధించిన చిత్రీకరణ మొదలవుతుందట. దాదాపు 20 రోజుల పాటు బిపాసా షూటింగ్ లో పాల్గొంటారు. సినిమాలో ఈ పాత్ర వ్యవది 40 నిమిషాలు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X