తెలుగులో సెక్సియస్ట్ వుమెన్ ఐటమ్ సాంగ్
ఆసియన్ సెక్సీయస్ట్ ఉమెన్ గా రెండోసారి ఎంపికైన బిపాసా బసు తెలుగులో ఐటమ్ సాంగ్ చేస్తే ఎలా ఉంటుంది. ఎలా ఉంటుందో ఏమో కానీ ఆమె చేస్తోంది. హిందీలో రూపొందిన బంటీ ఔర్ బబ్లీ సినిమాను తెలుగులో ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాలో తరుణ్, ఇలియానా హీరోహీరోయిన్లుగా చేస్తున్నారు. జగపతిబాబు ప్రత్యేక పాత్రలో నటిస్తున్నాడు. విజయ్ భాస్కర్ దర్శకత్వం వహిస్తున్నాడు.
హిందీలో హిట్ అయిన కజ్రారే...కజ్రారే పాటలాగే తెలుగులోనూ ఒక హిట్ పాటను రూపొందించాలని బెల్లంకొండ సురేష్ ఈ సినిమాలో బిపాసాతో ఐటమ్ సాంగ్ చేయించాలని అనుకుంటున్నాడు. ఇందుకోసం బిపాసాను ఇప్పటికే బెల్లంకొండ సంప్రదిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఇలియానా, తరుణ్, జగపతిబాబు, దర్శకుడు విజయభాస్కర్ లకు ఇప్పటికే పెద్దమొత్తంలో చెల్లించినట్టు తెలుస్తోంది. బిపాసా కనుక తన సినిమాలో ఐటమ్ సాంగ్ చేస్తానంటే ఎంతమొత్తమైనా చెల్లించడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











