హాట్ బ్యూటీ బిపాషా బసు గ్రీస్ లో రొమాన్స్...!
పెళ్ళి తర్వాత జీవితం ఎలావుంటుంది? ప్రేమ జంట పెళ్ళి చేసుకున్నాక ఎలాంటి జీవితాన్ని ఆస్వాదిస్తారు? అనే కథాంశంతో రూపొందుతున్న చిత్రం 'షాదీ ఫాస్ట్ ఫార్వర్డ్". కంగనా రౌనత్ తో 'తను వెడ్స్ మను" చిత్రం తర్వాత మాధవన్ నటిస్తున్న చిత్రమిది. ఇందులో మాధవన్ కు జోడీగా హాట్ బ్యూటీ బిపాషా బసు నటిస్తోంది. రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రానికి అశ్విన్ చౌదరి దర్శకుడు. త్వరలో షూటింగ్ కోసం యూనిట్ గ్రీస్ కు బయలుదేరబోతోంది.
ఇక్కడే మాధవన్, బిపాషా బసుపై రొమాంటిక్ సన్నివేశాలని దర్శకుడు అశ్విన్ చౌదరి చిత్రీకరించడానికి సన్నాహాలు చేస్తున్నాడు. తొలిసారి మాధవన్ తో కలిసి నటిస్తున్న బిపాషాబసు చిత్ర వివరాలు తెలియజేసూ ఈ చిత్ర 'స్క్రిప్ట్ నచ్చి ఈ చిత్రంలో నటించడానికి అంగీకరించాను. మాధవన్ చాలా రొమాంటిక్ గా వుంటాడు. మా ఇద్దరి మధ్య తెరపై మంచి కెమిస్ట్రీ పండుతుందని ఆశిస్తున్నాను. అతనితో తొలిసారి కలిసి నటిస్తుండటం ఆనందంగా వుంది. మా కాంబినేషన్ లో గ్రీస్ లో చిత్రీకరించే రొమాంటిక్ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం మంచి విజయాన్ని సాధిస్తుందన్న నమ్మకముందని" చెబుతోంది.


Click it and Unblock the Notifications











