‘బిపాషా బసుని’ నిరాశపరిచిన మణిరత్నం
మణిరత్నం రూపొందిస్తున్న చిత్రం 'రావణ్" ఈ సినిమా నుండి 'బిపాషా బసుని" తొలగించారు. 'రావణ" చిత్రంలో రావణాసురిడి(విక్రమ్)కి భార్య గా 'బిపాషా బసుని" మండోదరి పాత్రలో గెస్ట్ రోల్ లో ఒక పాట, కొన్ని సన్నివేశాలు చిత్రీకరించడానికి మొదట మణిరత్నం భావించారు. అయితే సినిమాలో లెంగ్త్ ప్రాబ్లమ్ వల్లనో మరి లీడ్ లేడీస్ ఐశ్వర్యారాయ్ మరియు ప్రియమణి డామినేట్ అవుతారనో ఆమె పాత్రని కథలోంచి తొలగించారు.
బిసాషా బసు బాధ పడకుండా ఉండేందుకు తన తదుపరి తీయబోవు చిత్రంలో ఆమెకు ప్రధాన పాత్ర ఇస్తానని మణిరత్నం మాటిచ్చినట్టు సమాచారం. అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యరాయ్, విక్రమ్, ప్రియమణి 'రావణ్" లో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. 'అశోకవనం" టైటిల్ తో తెలుగు, తమిళ వెర్షన్స్ లో రూపొందుతోన్న ఈ చిత్రంలో విక్రమ్, ఐశ్వర్యారాయ్, పధ్వీరాజ్, ప్రియమణి లీడ్ రోల్స్ చేస్తున్నారు. మరి బిసాసాబసుకి మణిరత్నం ద్వారా ఆ అవకాశం దక్కుతుందో లేదో వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











