ఆ పావు గంటకి బిపాసా కాస్ట్ రెండు కోట్లు
ఈ సంవత్సరం న్యూ ఇయర్‌కి అత్యధిక పారితోషికం అందుకుంటోన్న నటిగా బిపాషా బసు నిలిచారు. ఆమె ఒక హోటల్ వారితో రెండు కోట్ల రూపాయలకు ఒప్పందం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆమె కేవలం 15 నిమిషాలు మాత్రమే వుంటుంది. దాంతో న్యూ ఇయర్ ఈవెంట్‌లో అంత తక్కువ సమయానికి రెండు కోట్ల రుపాయల పారితోషికాన్ని తీసుకుంటున్న నాయికగా బిపాషా వార్తల్లో నిలిచారు. అయితే ఈ నెంబర్ వన్ స్ధానం కత్రినాకైఫ్ కి దక్కాల్సి ఉంది. ఆమె సుమారు రెండున్నర కోట్ల రూపాయల ఆఫర్‌ని వదులుకుంది.ఇటీవలే చిన్న సర్జరీ జరగడంతో న్యూ ఇయర్ ఈవెంట్‌లో పాల్గొనకూడదని ఆమె నిర్ణయం తీసుకుంది.అందుకు ముందు చేసుకున్న ఒప్పందాన్ని కత్రినాకైఫ్ రద్దు చేసుకుంది.
ఈ న్యూ ఇయిర్ వేడుకలు గురించి బిపాసా మాట్లాడుతూ.. నా సోదరి బిదిషా బ్యాంకాక్ వెళుతోంది. మా అమ్మానాన్నలు లండన్ నుంచి కోల్‌కతాకు వస్తున్న మరో సోదరి బిజోయితా దగ్గరకు వెళుతున్నారు. అందుకే కుటుంబ సభ్యులు లేకుండా ఈ వేడుకలు జరుపుకోవల్సి వస్తోందన్నారు.ఇక ఓ ఫైవ్ స్టార్ హోటల్‌లో డిసెంబరు 31 రాత్రి 15 నిమిషాలపాటు ఆమె నృత్య ప్రదర్శన ఉంటుంది. ఇందులో '70 ల నాటి పాటల్తోపాటు ఆమె నటించిన చిత్రాల హిట్ పాటలకు నృత్యం చేస్తుంది. ఆ రోజు బిపాసా ధరించబోయే దుస్తుల్ని ఫ్యాషన్ డిజైనర్ రాకీ రూపొందిస్తున్నారు. అదే హోటల్‌లో ఆమె తనవాళ్లకి పార్టీ ఇస్తోంది. దానికి జాన్ అబ్రహమ్ కుటుంబ సభ్యులు,బిపాసా స్నేహితులు మాత్రమే హాజరవుతున్నారు. ఆమె కుటుంబ సభ్యులు ఎవరూ రావట్లేదు.


Click it and Unblock the Notifications











