త్రాగిన వీడియో లీక్, స్టార్ హీరోయిన్ అప్ సెట్
బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో ఒకరైన బిపాసాబసు ఇప్పుడు లీకెడ్ వీడియో సమస్యను ఎదుర్కొంటోంది. ఈ విషయమై ఆమె ట్వీట్ చేస్తూ... నేను షాక్ లో ఉండిపోయా..ఆ వీడియోను చూసి..అవి నా జీవితంలో ప్రెవేట్ మూమెంట్స్.. నాకు ప్రైవసీ లేకుండా పోయింది.. నేను చాలా అప్ సెట్ అయ్యాను అంది. ఆమె భర్తడే రీసెంట్ గా శనివారం జరిగింది. తన ముప్పై మూడవ ఏట ప్రవేశించిన ఆమె గ్రాండ్ గా తన ఇంట్లో పార్టీ ఇచ్చింది. అక్కడ తన ప్రెండ్స్ మిలింద్ సోమన్, ఆప్ధాబ్ శివదాని, సికిందర్ ఖేర్, అభయ్ డయోల్ వీరందిరితో ఆమె మందు కొడుతూ డాన్స్ చేస్తూ ఎంజాయ్ చేయటం చాలా స్పష్టంగా ఆ వీడియోలో ఉంది.
న్యూడ్ గా కనపడే గౌన్ వేసుకుని ఆమె అందరికీ ఛీర్స్ చెప్పింది. ఆమె తాజా చిత్రం ప్లేయర్స్ లోని పాటకు కూడా ఆమె డాన్స్ చేసింది. అక్కడ జరిగిన ప్రెవేట్ విషయాలతో ఇంటర్నెట్ లో వీడియో అప్ లోడ్ అయ్యింది. అయితే ఆమెకు తెలియకుండా ఇదంతా ఎలా రికార్డు అవుతుందని కొందరు ప్రశ్నిస్తున్నారు. అనవసరంగా ఈ వీడియో విషయం ట్వీట్ చెయ్యటం ద్వారా ఆ వీడియోకు మరింత ప్రాచుర్యం పెంచటం తప్ప ప్రత్యేకంగా ఒరిగేమి ఉందని అంటున్నారు.


Click it and Unblock the Notifications











