ఆ హీరో ప్రక్కన అయితే తెలుగులో చేస్తా ...బిపాసా బసు
గతంలో మహేష్‌బాబుతో 'టక్కరి దొంగ" చేశాను. భాషపరమైన సమస్యల వల్ల ఆ తర్వాత తెలుగులో చేయలేదు. కానీ, రానా హీరో అయితే మాత్రం తెలుగులో చేస్తాను. తన దగ్గర్నుంచి భాష నేర్చుకుంటాను అంటూ నవ్వుతూ చెప్పుకొచ్చింది బిపాసాబసు. హిందీలో రానా సరసన ఆమె నటించిన 'దమ్ మారో దమ్" ఏప్రిల్ 22న విడుదల కానుంది.ఈ చిత్రం ప్రమోషన్‌లో భాగంగా గురువారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో బిపాసా పై విధంగా స్పందించారు. అభిషేక్ బచ్చన్, రానా, ప్రతీక్ బబ్బర్, బిపాసా కాంబినేషన్‌లో రోహన్ శిప్పి దర్శకత్వంలో రమేష్ శిప్పి ఈ చిత్రాన్ని నిర్మించారు.ఈ సందర్భంగా ఆమె మీడియాతో ముచ్చటిస్తూ ఇలా చెప్పుకొచ్చింది.
అలాగే ఈ చిత్రం గురించి చెబుతూ... హీరో, హీరోయిన్ అని కాకుండా ప్రతి పాత్రకూ ప్రాధాన్యం ఉంటుంది. అద్భుతమైన కథతో రూపొందిన ఈ చిత్రం నాకు మంచి అనుభూతి నిచ్చింది అంది. దర్శకుడు రోహన్ శిప్పి చెబుతూ- ఈ చిత్రంలో మ్యుజిషియన్ పాత్రకు రానా సరిపోతాడని తనని తీసుకున్నాం. ఇదొక సస్పెన్స్ థ్రిల్లర్ డ్రామా అన్నారు.అలాగే రానా మాట్లాడుతూ..'లీడర్"కి ముందే ఈ సినిమా ఒప్పుకున్నాను. నా రెండో చిత్రం హిందీ అవుతుందని నేనూహించలేదు. అభిషేక్, బిపాసా తదితరులు స్నేహపూర్వకంగా మెలిగారు.
మన తెలుగు సినిమాలకు, హిందీకి మేకింగ్‌పరంగా పెద్ద తేడా లేదు. కానీ కథ, కథనం చెప్పే విధానంలో మాత్రం మార్పు ఉంది. మన తెలుగుతో పోల్చితే హిందీ రంగం ఇంకా విస్తృతం కాబట్టి.. కొత్త జానర్ సినిమాలు అక్కడ ఎక్కువ. ఈ చిత్రంలో మూడు కథలు ఉంటాయి అన్నారు.


Click it and Unblock the Notifications











