'అరుంధతి'సినిమా మూలం

అలాగే ఈ చిత్రానికి ప్రేరణగా నిలిచిన అంతర్జాతీయ సినిమాలు గురించి మాట్లాడుతూ..నేను హాలీవుడ్ సినిమాలకు గొప్ప అభిమానని. ముఖ్యంగా జపాన్,యూరోపియన్ ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకర్స్ రూపొందించిన చిత్రాలంటే ప్రాణం. వారు రెండు మూడేళ్ళు కష్టపడి రెండు గంటల సినిమా రూపొందిస్తారు. సినిమాలంటే వాళ్ళకున్న ఫ్యాషన్ ఆశ్చర్యమేస్తుంది. ఇక ప్రేరణ దగ్గరకొస్తే..నాకు ఇతర సినిమాల నుండి ప్రేరణ పొందటం తప్పేమీ అనిపించదు. అరుంధతి సినిమాలో ఫకీర్ పాత్ర.
1976లో వచ్చిన ది ఒమెన్ చిత్రంలో ప్రీస్ట్ పాత్ర నుండి తయారు చేసుకున్నది. నాకు పదహేరాళ్ళప్పుడు ది ఒమెన్ సినిమా రిలీజైంది. నేను అప్పుడు పదవతరగతి చదువుతున్నాను. దేవీ ధియోటర్(చెన్నై) పదిహేను సార్లుకు పైగా ఆ సినిమాను చూసాను. నాకు ఇప్పటికీ అందులో సీన్స్, డైలాగులు గుర్తున్నాయ్...అంటూ చెప్పుకొచ్చారు.


Click it and Unblock the Notifications











