డబ్బు తీసుకోలేదు, ఆయనే ప్రపోజ్ (రేణు దేశాయ్ ఇంటర్వ్యూ)
హైదరాబాద్: నటి, దర్శకురాలు, నిర్మాత, టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్.......ఈ రోజు తన పుట్టినరోజును పురస్కరించుకుని ఇంటర్వ్యూలో తన పర్సనల్ విషయాల గురించి చెప్పుకొచ్చారు. తన పిల్లలను నార్మల్ గానే పెంచుతున్నానని, సెలబ్రిటీల పిల్లల్లా ప్రత్యేకంగా పెంచడం లేదు. అప్పుడే వారు రియాల్టీని అర్థం చేసుకుంటారని రేణు దేశాయ్ చెప్పుకొచ్చారు.
18 ఏళ్ల వయసులో బద్రి సినిమా చేయడానికి హైదరాబాద్ వచ్చానని, మొదటి చూపులోనే ఆయన (పవన్ కళ్యాణ్) ప్రేమలో పడ్డానని రేణు దేశాయ్ చెప్పుకొచ్చారు. తొలుత ప్రపోజ్ చేసింది మాత్రం ఆయనే. నాకు 19 సంవత్సరాలు ఉన్నపుడు పెళ్లి చేసుకున్నాం...అయితే ఇది ఫీషియల్ పెళ్లి కాదు, ఒకరినొకరు ఇష్ట పడి కలసి ఉన్నామని తెలిపారు.
నేను ఆయనతో విడిపోయిన తర్వాత ఆయన నుండి 40 కోట్లు తీసుకున్నట్లు ప్రచారం జరిగింది. ఈ విషయాలు బయట విని ఆయన నాకు ఫోన్ చేసి ఆశ్చర్యపోయారు. నేను ఆయన నుండి ఎలాంటి డబ్బు తీసుకోలేదు. సన్నిహితులందరికీ ఈ విషయం తెలుసు అన్నారు రేణు దేశాయ్.
తమ మధ్య పెద్దగా గొడవలు ఏమీ లేవు. ప్రశాతంగా, సుఖంగా విడిపోయారు. తాము ఎందుకు విడిపోయామనే విషయం నాకు ఆయనకే తెలుసు. భార్యా భర్తల మధ్య ఎవరూ మాట్లాడకూడదను అని పెద్దలు అంటుంటారు....అంటూ దాట వేత ధోరణి ప్రదర్శించారు రేణు దేశాయ్.
ఆ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.
తన జీవితంలో జరిగిన కొన్ని ముఖ్యమైన వ్యక్తిగత విషయాలను నేడు వెల్లడిస్తానని పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మాజీ సతీమణి రేణుదేశాయ్ ప్రకటించినప్పటి నుంచి ఆయన అభిమానులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. తన పుట్టిన రోజు సందర్భంగా ప్రత్యేక ఇంటర్వ్యూ ఇస్తున్నానని, దాన్ని యూట్యూబ్ లో చూడవచ్చని నిన్న ఆమె ప్రకటించిన సంగతి తెలిసిందే.



Click it and Unblock the Notifications











