»   » బర్త్ డే స్పెషల్: మహేష్ బాబు చిన్నతనంలో (ఫోటోష్)

బర్త్ డే స్పెషల్: మహేష్ బాబు చిన్నతనంలో (ఫోటోష్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ప్రస్తుతం టాలీవుడ్లో టాప్ రేంజిలో ఉన్న హీరోల్లో మహేష్ బాబు ఒకరు. ఆగస్టు 9న మహేస్ బాబు పుట్టినరోజు. వివాద రహితుడైన మహేష్ బాబు మర్యాదగల వ్యక్తిగా, సాఫ్ట్ పర్సన్‌గా పేరు తెచ్చుకున్నారు. కెరీర్లో మురారి, ఒక్కడు, పోకిరి, దూకుడు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, తాజాగా ‘శ్రీమంతుడు' అలాంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన మహేష్ బాబు......బాల నటుడిగాను తనదైన ప్రతిభతో ఆకట్టుకున్నారు.

సినిమా కుటుంబంలో జన్మించడంతో చిన్నతనంలోనే సినిమాల్లో నటించే అవకాశం వచ్చింది. మహేష్ బాబు తన సినీ ప్రస్థానాన్ని తన సోదరుడు రమేష్ బాబు నటించిన నీడ చిత్రం లో ఒక చిన్న పాత్ర తో మొదలు పెట్టాడు. 1983 లో ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ మనవి మేరకు పోరాటం సినిమా లో తన తండ్రి కృష్ణ కు తమ్ముడి గా నటించాడు.

ప్రముఖ దర్శక-నిర్మాత డూండీ ఆ చిత్రం లో మహేష్ నటన చూసి అతను కృష్ణ గారి అబ్బాయి అని తెలుసుకుని ఆశ్చర్యపోయి ఆ అబ్బాయికి మంచి భవిష్యత్తు ఉంది అని కితాబు ఇచ్చారు. అయన ఊహించిన విధంగానే బాల నటుడి గా తెలుగు ప్రేక్షకుల మెప్పు పొందినాడు.

తండ్రి దర్శకత్వంలో

తండ్రి దర్శకత్వంలో


1987 లో తొలిసారిగా తన తండ్రి దర్శకత్వం వహించిన శంఖారావం చిత్రంలో నటించాడు మహేస్ బాబు. 1988 లో విడుదలైన మరియు కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించిన బజార్ రౌడీ చిత్రం లో అన్నయ్య రమేష్ తో కలిసి నటించాడు.

తండ్రి, అన్నయ్యతో కలిసి

తండ్రి, అన్నయ్యతో కలిసి


1988 లో మరల తన తండ్రి మరియు అన్నయ్యలతో కలిసి ముగ్గురు కొడుకులు సినిమాలో నటించాడు. 1989 లో మరోసారి తన తొలి చిత్ర దర్శకుడు కోడిరామకృష్ణ తీసిన గూడచారి 117 చిత్రంలో నటించాడు.

ద్విపాత్రాభినయం

ద్విపాత్రాభినయం


1989 లో విడుదలైన కొడుకు దిద్దిన కాపురం చిత్రంలో మహేష్ తొలిసారి ద్విపాత్రభినయం చేసాడు. 1990 లో విడుదలైన బాలచంద్రుడు మరియు అన్న - తమ్ముడు సినిమాతో బాలనటుడి గా తన తొలి ఇన్నింగ్స్ ని ముగించాడు.

9 సినిమాల్లో

9 సినిమాల్లో


చిన్నతనంలో 9 సినిమాల్లో బాల నటుడిగా రాణించిన మహేష్ బాబు...ఇప్పటి వరకు దాదాపు 20 సినిమాల్లో హీరోగా నటించారు. మహేష్ బాబు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే మొత్తం ఏడు నంది అవార్డులు అందుకున్నారు.

ఇతర అవార్డులు

ఇతర అవార్డులు


అదే విధంగా బెస్ట్ తెలుగు యాక్టర్ గా మూడు ఫిల్మ్ ఫేర్ అవార్డులు దక్కించుకున్నారు. దీంతో పాటు మూడు సినీ ‘మా' అవార్డులు, ఒక సౌతిండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డు గెలుచుకున్నారు.

మహేష్ బాబు

మహేష్ బాబు


సూపర్ స్టార్ కృష్ణ-ఇంద్రాదేవిల సంతనం అయిన మహేష్ బాబు ఆగస్టు 9, 1975లో తమిళనాడులోని చెన్నైలో జన్మించారు. చిన్నతనంలోనే నాన్నతో సినిమా షూటింగులకు వెళ్లడం అలవాటయిన మహేష్ బాబు నటనపై ఆసక్తిని పెంచుకున్నాడు.

చదువు కోసం బ్రేక్

చదువు కోసం బ్రేక్


బాల నటుడిగా కొన్ని సినిమాల్లో నటించిన తరువాత చదువు మీద దృష్టి కేంద్రీకరించడం కోసం మహేష్ సినిమాలనుండి విరామం తీసుకున్నాడు. డిగ్రీ పూర్తి అయ్యాక తిరిగి సినిమారంగానికి వచ్చాడు. హీరోగా మహేశ్ తొలి చిత్రం రాజకుమారుడు.

తొలి విజయం

తొలి విజయం


2001లో సోనాలి బింద్రే హీరోయిన్ గా కృష్ణ వంశీ దర్శకత్వంలో వచ్చిన మురారి చిత్రం మహేష్ కు తొలి భారీ విజయాన్ని అందించింది. కానీ 2002 మహేష్ కు సంతృప్తిని ఇవ్వలేదు. ఆ సంవత్సరం విడుదల అయిన టక్కరి దొంగ, బాబీ సినిమాలు రెండూ పరాజయం పాలయ్యాయి. 2003లో మహేష్ కు తను ఎదురుచూస్తున్న విజయం లభించింది. గుణశేఖర్ దర్శకత్వంలో విడుదల అయిన ఒక్కడు చిత్రం 2003వ సంవత్సరానికి అతి పెద్ద హిట్ చిత్రంగా నిలచింది.

కుటుంబ విలువలకు ప్రాధాన్యం

కుటుంబ విలువలకు ప్రాధాన్యం


మహేష్ బాబుకు సోదరుడు రమేష్ బాబు(నటుడు, నిర్మాత)తో పాటు సోదరీమణులు పద్మావతి, మంజుల(యాక్టర్, ప్రొడ్యూసర్), ప్రియదర్శిణి ఉన్నారు. మహేష్ బాబుతో పాటు ఆయన కుటుంబం మొత్తం కుటుంబ, కుటుంబ విలువలకు అధిక ప్రాధాన్యత ఇస్తారు.

నమ్రతతో వివాహం

నమ్రతతో వివాహం


మాజీ ఫెమీనా మిస్ ఇండియా నమ్రత శిరోద్కర్‌తో 5 సంవత్సరాలు డేటింగ్ చేసిన మహేష్ బాబు ఆమెను ప్రేమ వివాహం చేసుకున్నారు. ఫిబ్రవరి 10, 2005లో వీరి వివాహం ముంబైలో జరిగింది. వీరికి ఇద్దరు సంతానం. కుమారుడి పేరు గౌతంకృష్ణ, కూతురు పేరు సితార.

English summary
Mahesh Babu childhood story. Mahesh Babu father made sure all the children spent sufficient time with him on location and on his sets, especially during holidays. Mahesh many times said that this was where his interest for acting began.
Please Wait while comments are loading...